స్మార్ట్ కిడ్జ్ లో హోరెత్తిన బతుకమ్మ సంబురం.
– బతుకమ్మ లతో కనువిందు చేసిన చిన్నారులు, టీచర్లు
టీ మీడియా, అక్టోబర్ 13,ఖమ్మం, :స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో శుక్రవారం బతుకమ్మ సంబురాలు హోరెత్తాయి.వివిధ రకాల పూలతో నేర్పుగా, ఓర్పు గా చిన్నారులు బతుకమ్మలను తయారు చేశారు.తాము తయారు చేసిన బతుకమ్మ లను పాఠశాల మైదానంలో వలయాకారం లోపల ఉంచి వలయాకారం చుట్టూ చప్పట్లు తాళాలతో, నృత్యాలు చేస్తూ వేడుకలను కనువిందు చేశారు.
మహిళా ఉపాధ్యాయులు పెద్ద బతుకమ్మ లను తయారు చేసి బతుకమ్మ గేయాలతో హుషారెత్తించారు.బతుకమ్మ పాటలతో అందరూ శృతి కలుపుతూ బతుకమ్మ వేడుకలను హోరెత్తించారు.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణచైతన్య, పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ వేడుకలు ప్రతీకలు అని తెలిపారు.తరతరాలుగా మన గ్రామాలతో పాటు అన్ని ప్రాంతాల్లో ఉత్సవాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయన్నారు.
Also Read : కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ఎంగిలి పూల బతుకమ్మ తో ప్రారంభమయ్యే వేడుకలు సద్ధుల బతుకమ్మ తో ముగుస్తాయని , వేడుకలు మహిళందరిలో ఉత్సాహాన్ని నింపుతాయని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube