బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన గోవింద శ్రీధర్ రెడ్డి

బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన గోవింద శ్రీధర్ రెడ్డి

1
TMedia (Telugu News) :

బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన గోవింద శ్రీధర్ రెడ్డి

టీ మీడియా, సెప్టెంబర్ 24, చిన్నంబావి: చిన్నంబావి మండలంలో పెద్ద మారు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అందచేస్తున్న బతుకమ్మ చీరలను పెద్దమారు సర్పంచ్ గోవింద శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా ఎంపీపీ సోమేశ్వరమ్మ, జెడ్పిటిసి కేశిరెడ్డి వెంకట్రావమ్మ చిన్నారెడ్డి, టీఆరెస్ పార్టీ మండల అధ్యక్షుడు గజ్జె ఈదన్న సింగల్ విండో అధ్యక్షుడు బగారి నరసింహారెడ్డి ఉప సర్పంచ్ బిసన్న తో కలిసి మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం జరిగింది.

Also Read : అధ్యక్ష పదవికి సోనియా ఫ్యామిలీ దూరం

తెలంగాణ సంస్కృతి లో భాగమైన బతుకమ్మ ను ఆడబిడ్డలు ఆటపాటలతో జరుపుకోవడం మన సాంప్రదాయానికి ప్రతీక అని పువ్వులు వేరు వేరు అయినా అన్ని కలిస్తే బతుకమ్మ తయారు అవుతుందని,మనం కూడా అందరం కలిసి ఉండాలి అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడపడుచులకు బతుకమ్మ చీరలు అందించారని,బతుకమ్మ అంటేనే గౌరమ్మ గౌరమ్మా అంటే ప్రకృతి కి ప్రతిరూపమని ఎంపీపీ జెడ్పిటిసి తెలియచేసారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసులు ఉపసర్పంచ్ బీసన్న శ్రీనివాసులు కిషోర్ భగవంతు రెడ్డి జగన్ రెడ్డి అంగన్వాడి సిబ్బంది,ఆశా కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకులు, వివిధ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొనడం జరిగింది.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube