జడ్పీ హెచ్ హై స్కూల్ బతుకమ్మ సంబరాలు

జడ్పీ హెచ్ హై స్కూల్ బతుకమ్మ సంబరాలు

1
TMedia (Telugu News) :

జడ్పీ హెచ్ హై స్కూల్ బతుకమ్మ సంబరాలు

టి. మీడియా సెప్టెంబర్ 24ముత్తారం :

ముత్తారంలోని జడ్.పి.హెచ్.ఎస్ ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ప్రధానోపాధ్యాయురాలు హేమావతి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి బతుకమ్మను పూలతో పేర్చి, పాఠశాలకు తీసుకొని వచ్చి పాఠశాల ఆవరణంలో ప్రతిష్టించి ఆటపాటలతో అలరించారు. ప్రధానోపాధ్యాయురాలు హేమావతి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను పది కాలాల పాటు కాపాడుకోవాల్సిన అవసరం ఉందని విద్యార్థులను ప్రోత్సహించి బతుకమ్మ పాటలతో గౌరమ్మను పూజించి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube