డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన బట్టీ విక్రమార్క

మహిళ ఉచిత ప్రయాణం నిధులు విడుదల కు తొలి సంతకం

0
TMedia (Telugu News) :

డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన బట్టీ విక్రమార్క

-మహిళ ఉచిత ప్రయాణం నిధులు విడుదల కు తొలి సంతకం

టీ మీడియా, డిసెంబర్ 14, హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చింది. అందులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. తాజాగా మహాలక్ష్మి పథకం ఉచిత బస్సు పథకానికి సంబంధించిన నిధుల విడుదలపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మొదటి సంతకం చేశారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పై రెండవ సంతకం చేశారు. రాష్ట్ర సచివాలయంలో ఆర్ధిక, ప్రణాళిక, విద్యుత్ మంత్రిత్వ శాఖల బాధ్యతలు స్వీకరించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. వేద పండితుల మంత్రాల మధ్యలో తన ఛాంబర్లోకి ప్రవేశించారు. ఆ తరువాత తన కుర్చీలో కూర్చొని కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా మహాలక్ష్మి పథకం సంబంధించిన ఫైళ్లను అందజేశారు కార్యదర్శులు. మహిళలకు కల్పిస్తున్న ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం సబ్సిడీని 374 కోట్ల రూపాయలు ఆర్టీసీకి విడుదల చేస్తూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తొలి సంతకం చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ సాయాన్ని 10 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా 298 కోట్ల రూపాయలను వైద్య ఆరోగ్య శాఖకు విడుదల చేస్తూ రెండవ సంతకం చేశారు.

Also Read : విద్యార్థినికి లాప్టాప్ అందజేసిన మాజీ ఏం ఎల్ ఏ కూతురు

విద్యుత్ సబ్సిడీ 996 కోట్ల రూపాయలు విడుదల ఫైలు పై మూడో సంతకం చేశారు. సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్ల కొరకు 75 కోట్ల రూపాయలు వివిధ శాఖల మంజూరుకు సిఫారసు చేసిన ఫైలుపై నాలుగో సంతకం చేశారు. ఇలా చెప్పిన ఆరు గ్యారెంటీలలో ఒక్కొదానికి అవసరమైనన్ని నిధులను విడుదల చేస్తూ పథకాలకు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా సాఫీగా కొనసాగించేందుకు తగు కార్యాచరణను రూపొందిస్తున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube