టీ, మీడియా, అక్టోబర్,30 మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రగతి నగర్ బీసీ కార్యాలయం నందు జరిగిన బీసీ సంఘం నాయకులు సమావేశం లో
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ముధుర కోళ్ళ కిషోర్ మాట్లాడుతూ… బీసీ జాబితా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని,అలాగే బీసీలలో 140 కులాలు ఉన్న అత్యంత వెనుకబడిన కులాలు ఉన్నాయి వాటిలో పూసల కులం, బోయ్యా,కాటికాపారి కూలాలు వెనుకబడిన్నాయి.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వెనుకబడిన కులాలకు వృత్తిపరంగా రుణాలు ఇస్తామని ఆర్థిక మంత్రి హరీష్ రావు మాట ఇచ్చారు.వెనుకబడిన కులాలు అత్యంత దయనీయ స్థితిలో గడుపుతున్నారు కావున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారిని గుర్తించి వారికి తగు న్యాయం చేయగలరని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
వారిని బీసీల బీసీ జాబితా విడుదల చేయాలని,అలాగే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసి ఎంబీసీలో చేర్చి కలపాలి అలాగే బీసీ బంధు ఒకటి పూసల కులాన్ని ఆదుకోవాలని కోరారు.
అదే విధంగా కుల ప్రాతిపదికన ఏర్పాటు చేసి పూసల కులాన్ని ఎస్ టి జాబితాలో చేర్చి, వెనుకబడిన కులాలని ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వం పై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీ రామ్ ప్రసాద్,చరణ్,సంపత్, జిల్లా,కుల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.