బిసి కులగణన వెంటనే చేపట్టాలి

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 15 వనపర్తి : జనగణనలో బీసీ కులగణన వెంటనే చేపట్టాలని డిమాండ్ తో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శివన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఢిల్లీలో చేపట్టిన బీసీల జంగ్ సైరన్లో బీసీ మహిళా సంఘ ఉమ్మడి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కావలి మధులత పాల్గొన్నారు. బుధవారం జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ధర్నాలో ఆమె మాట్లాడుతూ జనగణనలో బీసీ కులాలను లెక్కించాలని దేశవ్యాప్తంగా బీసీలు ఉద్యమిస్తుంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం స్పందించి వెంటనే కులగణన చేపట్టాలని లేనిపక్షంలో తాడోపేడో తేల్చుకునేందుకు బీసీలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో బీసీ గణనపై చర్చ జరిగేలా అన్ని రాజకీయ పార్టీలు ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. బీసీ గణన చేపట్టాలని అసెంబ్లీ తీర్మానం చేసిన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు కూడా పార్లమెంట్లో ఎందుకు మాట్లాడటం లేదో ప్రజలకు చెప్పాలన్నారు. ఇదే బీసీ వ్యతిరేక విధానాలతో వ్యవహరిస్తే బీసీల ఏకమై వచ్చే ఎన్నికల్లో వారికి రాజకీయ సమాధి కడతామన్నారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం నాయకులు బాల్రాజ్ గౌడ్, అంజన్న యాదవ్, కావలి అశోక్కుమార్, మహీందర్ నాయుడు, శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube