బీసీ ఓవర్సీస్’కు కొనసాగుతున్న సర్టిఫికెట్ల పరిశీలన

బీసీ ఓవర్సీస్’కు కొనసాగుతున్న సర్టిఫికెట్ల పరిశీలన

1
TMedia (Telugu News) :

‘బీసీ ఓవర్సీస్’కు కొనసాగుతున్న సర్టిఫికెట్ల పరిశీలన
టి మీడియా,జూన్ 26,హైదరాబాద్:
మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ విదేశీ విద్యానిధి పథకం కింద ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకొన్నఅభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ కొనసాగుతున్నది. ఈ నెల 20 నుంచి ఇప్పటివరకు 150 మంది అభ్యర్థుల అర్హత పత్రాలను పరిశీలించారు. వీటిని అధికారులు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు.

Also Read : చెక్ డ్యాం ల నిర్మాణంలోకాంట్రాక్టర్ల మాయ

మొత్తం 571 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. వీరిలో 438 మంది బీసీ కులాల వారు కాగా, 133 మంది ఈబీసీ అభ్యర్థులున్నారు. అభ్యర్థులు.. నిర్దేశించిన తేదీల ప్రకారం మాసాబ్‌ట్యాంక్‌లోని సంక్షేమభవన్‌, ఆరో అంతస్థుకు సకాలంలో హాజరు కావాలని అధికారులు తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube