రాజకీయ పార్టీగా బీసీ రాష్ట్ర సంక్షేమ సంఘం
టీ మీడియా, జూన్ 27, గుంటూరు:
బిసిలకు ప్రాధాన్యతనివ్వని రాజకీయ పార్టీల భరతం పట్టాలనే ఉద్దేశంతో త్వరలోనే బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతన రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకరరావు తెలిపారు. గుంటూరు కన్వెన్షన్ కార్యాలయంలో ఆదివారం బిసిలకు చెందిన నాయకులతో సంక్షేమ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం జరిగింది.ఈ సందర్భంగా నంద్యాల జిల్లా బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు వై నాగ శేషు మాట్లాడుతూ బీసీల రాజ్యాధికారం కోసం బీసీల హక్కుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకు ఒక రాజకీయ పార్టీ అవతరించాలని రాబోయే రోజుల్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను ఏకం చేసుకుని సరికొత్త రాజకీయ పార్టీ రాష్ట్రానికి అందించడానికి ఏర్పాటు చేయాలని కోరారు.
Also Read : ఆలయాల అభివృద్ధికి పొంగులేటి ఆర్థికసాయం
‘ఓట్లు మనవే..సీట్లు మనవే’ అని బిసిల్లో చైతన్యం కలిగించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో నంద్యాల అధ్యక్షులు వై నాగశేషు, ప్రధాన కార్యదర్శి లక్ష్మీ నారాయణ గౌడ్,యువజన నాయకులు నారాయణ,వీర శేఖర్, తదితరులు పాల్గొన్నారు.