టీ మీడియా డిసెంబర్ 10 వనపర్తి : వైయస్సార్ తెలంగాణ పార్టీలో బీసీ మహిళలకు గుర్తింపు లేదని ఆ పార్టీలో అగ్రవర్ణాల వారిని అందలం ఎక్కిస్తూ బీసీలను అణిచి వేస్తున్నారని అందుకే ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు వైయస్సార్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కావలి మధులత ప్రకటించారు. శుక్రవారం నాడు వనపర్తి జిల్లా కేంద్రంలోని ఆమె నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నా రాజకీయ జీవితం వైసీపీతోనే ప్రారంభం అయిందని జగన్ నాయకత్వంలో దశాబ్దానికి పైగా పని చేశానని ఆ తర్వాత షర్మిల పార్టీలో చేరనున్నారు. ఒక మహిళా పెట్టిన రాజకీయ పార్టీలో మహిళలకు పెద్దపీట వేస్తుందని నమ్మి ఆమెతోపాటు నడుస్తామని కానీ అది మూడునాళ్ళ ముచ్చట అవుతుందని ఊహించలేకపోయాను. అని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకోసం కష్టపడే బీసీలకే పదవులు మాత్రం ఒకే సామాజిక వర్గం వారికి కట్టబెడుతున్నారని దీనిపై అధినేత్రి షర్మిల దృష్టికి ఎన్నిసార్లు తీసుకువెళ్లిన కూడా ఫలితం లేకుండా పోయిందని అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో 50 శాతం టికెట్లు బీసీలకు 50 శాతం టిక్కెట్లు మహిళలకు కేటాయిస్తానని చెప్పినటువంటి షర్మిల పార్టీలో పదవులు మాత్రం ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలన్నారు. అందుకే ఏ పార్టీలో కూడా బీసీలకు సముచిత ప్రాధాన్యత లేదని భావించి బీసీ సమస్యలపై పోరాటం చేయాలనే లక్ష్యంతో బీసీ సంక్షేమ సంఘంలో చేరుతున్నానని తెలిపారు. బీసీ సంక్షేమ సంఘంలో చేరిన మధులతను బీసీ మహిళా సంఘం ఉమ్మడి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తున్నట్లు రాచాల ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం నాయకులు బాలరాజ్ గౌడ్, అశోక్ కుమార్ ,నరేందర్ గౌడ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.