బీసీలు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలి
బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యత వర్ధిల్లాలి
టీ మీడియా, ఏప్రిల్ 25, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రంలోని యాదవ సంఘం భవనంలో అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ అధ్యక్షతన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో పలు సంఘాలు పలు పార్టీల నాయకులు కుల సంఘ నాయకులు పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరై తమ అభిప్రాయాలు వెల్లడించారు.వాటిలో ముఖ్యంగా 1985 తర్వాత బీసీలకు ఏ ఒక్క పార్టీ సీటు ఇవ్వకపోగా వారిని అనగా తొక్కుతున్న పరిస్థితులను చూసి ఇప్పుడు అన్ని పార్టీలు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ఎన్టీ రామారావు 12 సీట్ల గాను ఎనిమిది సీట్లు బీసీలకు ఇచ్చి గౌరవించారు. ఇప్పుడున్న 14 సీట్లలో కనీసం ఎనిమిది సీట్లును కేటాయించాలని ఎస్సీలకు రెండు సీట్లు రిజర్వుగా ఉన్నాయని, ఎస్టీకి ఒకటి మైనార్టీలకు ఒకటి, మిగితా ఏడు బీసీలకు కేటాయించాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు.అలాగే తెలంగాణ వచ్చిన తర్వాత ధరణి పోటర్లు అణగారిన వర్గాల భూములు వాటి ఇబ్బందులతో ఎస్టి ఎస్సి బిసి వర్గాలు ఇబ్బందులకు గురవుతున్నారని, వాటిని పరిష్కరించాలని,బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలపై అక్రమ కేసులు దాడులు జరుగుతున్నాయని వాటిని అరికట్టాలని వచ్చిన పలు సంఘాల నేతలు ప్రభుత్వానికి అల్టిమేట్ ఇవ్వడం జరిగింది.
AlsoRead:అక్షయ క్షేత్రం కేంద్రాలను పరిశీలించిన జేఈవో శ్రీమతి సదా భార్గవి
ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించిన అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్, ముఖ్యఅతిథిలుగా పాల్గొన్న బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మోహన్ కుమార్ యాదవ్, స్వచ్ఛ జేఏసీ రాష్ట్ర కోఆర్డినేటర్ బోల్లి ఆడం రాజు, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు చేన్న రాములు , బంజారా సంగం అధ్యక్షుడు శివ నాయక్, కళాకారులు రాజారాం ప్రకాష్, జనజ్వాల, అఖిలపక్ష నాయకులు వెంకటేశ్వర్లు, జానంపేట రాములు, రమేష్ యాదవ్ టీజేఎస్ జిల్లా అధ్యక్షులు ఖాదర్ బాషా,షఫీ, అడ్వకేట్ ఆంజనేయులు,ఉదయ్, ఉపద్యాయ సంఘాల నేతలు విజయ్,కురుమన్న,తేనీటి రవి, స్వర్ణకార సంఘం నాయకులు పరమేశ్వర చారి, సంఘాల నాయకులు గోపాలకృష్ణ రమేష్, నాయక్, సంఘం నాయకులు పుట్టపాక బాలు, మహేంద్ర సంగం నాయకులు, శాలివాహన సంఘం నాయకులు, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube