25న “పార్లమెంట్ మార్చ్” ను జయప్రదం చేయండి

-  వాల్ పోస్టర్ ఆవిష్కరించిన ఏఐవైఎఫ్ నాయకులు

1
TMedia (Telugu News) :

25న “పార్లమెంట్ మార్చ్” ను జయప్రదం చేయండి

 

–  వాల్ పోస్టర్ ఆవిష్కరించిన ఏఐవైఎఫ్ నాయకులు

టీ మీడియా, నవంబర్ 19, గోదావరిఖని : ఈ నెల 25న దేశ రాజధాని ఢిల్లీలో జరుగు పార్లమెంట్ మార్చ్ ను జయప్రదం చేయాలని అందుకు సంబందించిన వాల్ పోస్టర్ ను శనివారం భాస్కర్ రావు భవన్ లో ఏఐవైఎఫ్ నాయకులు విడుదల చేశారు.ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మార్కపురి సూర్య మాట్లాడుతూ…నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని,భగత్ సింగ్ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని,నూతన జాతీయ విద్యా విధానం2020 ను ఉపసంహరించుకోవాలని,

Also Read :  ఘనంగా అయ్యప్పస్వామి పడి పూజ

దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగ పోస్టులను భర్తీ చేయాలనే ప్రధాన డిమాండ్ల సాధన కోసం ఏఐవైఎఫ్-ఏఐఎస్ఎఫ్ జాతీయ సమితి సంయుక్తంగా నవంబర్ 25వ తేదీన విద్య-ఉపాధి హక్కుల సాధన కోసం “పార్లమెంట్ మార్చ్”ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వేలాదిగా విద్యార్థులు, యువకులు తరలి రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు తాళ్లపల్లి సురేందర్ సహయ కార్యదర్శి వనపాకల విజయ్ నాయకులు రాణవేణి సుధీర్ కుమార్ , ఆసాల నవీన్ కుమార్, శివకుమార్,దిలీప్,అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube