సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

0
TMedia (Telugu News) :

–మంచిర్యాల ఏసీపీ సాధన రష్మీ పెరుమాళ్.

టి మీడియా డిసెంబర్ 22 లక్షెట్టిపేట్

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మంచిర్యాల ఏసీపీ సాధన రష్మీ పెరుమాళ్ అన్నారు.బుధవారం పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల లో విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ…… విద్యార్థులు ఈవ్ టీజింగ్, పోకిరీల వేధింపులకు గురైతే వెంటనే స్థానిక పోలీసులు లేదా షీ టీమ్ పోలీసులకు సమాచారమివ్వాలన్నారు. గొప్ప లక్ష్యంతో పట్టుదలతో చదివి మహిళల అభ్యున్నతికి పాటుపడాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.అదే విధంగా సూసైడ్ వంటి అఘాయిత్యానికి ఎప్పుడూ పాల్పడవద్దని తెలిపారు. మాస్క్ ధరించి,భౌతిక దూరం పాటించి పాఠశాల కు రావాలన్నారు.అంతకుముందు సీఐ కరీముల్లాఖాన్ మాట్లాడుతూ…..విద్యార్థులు చక్కటి క్రమశిక్షణ, గొప్ప లక్ష్యం తో చదివి తల్లిదండ్రులకు, దేశానికి మంచి పేరు తీసుకురావాలన్నారు.

అంతకుముందు ఎస్సై చంద్రశేఖర్ మాట్లాడుతూ….ఈ రోజు గణిత దినోత్సవం ను పురస్కరించుకుని పాఠశాలలో మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్యార్థులు బాగా చదివి సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో లక్షెట్టిపెట్ సీ ఐ కరీముల్లా ఖాన్,ఎస్సై చంద్ర శేఖర్,పీ ఎస్సై హైమా,ఎం ఈ ఓ రవీందర్,పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాద్యాయులు పాల్గొన్నారు.

be vigilant against cyber crime
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube