ముగ్గురిపై దాడిచేసిన ఎలుగుబంటి .

ముగ్గురిపై దాడిచేసిన ఎలుగుబంటి .

2
TMedia (Telugu News) :

ముగ్గురిపై దాడిచేసిన ఎలుగుబంటి

టి మీడియా, నవంబరు 7, చెన్నై: తమిళనాడులోని తెన్‌కాశిలో ఎలుగుబంటి హల్‌చల్‌ చేసింది. ముగ్గురు వ్యక్తులపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది. తెన్‌కాశి జిల్లాలోని కరుతిలింగపురం గ్రామానికి చెందిన వైకుంఠమణి అనే వ్యక్తి శివసైలం నుంచి పెతన్‌పిళ్లై గ్రామానికి బైక్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో మర్గమధ్యంలో ఉన్న అటవీ ప్రాతాన్ని దాటుతుండగా పొదల్లో నక్కిఉన్న ఎలుగుబండి ఒక్కసారిగా అతనిపై దాడిచేసింది. దీంతో వైకుంఠమణి బైక్‌పై నుంచి కిందపడిపోయాడు. అతనిపై కూర్చున్న బల్లూకం.. తలను కొరకడం ప్రారంభించింది.

Also Read : నిబంధనలకు విరుద్ధంగా పబ్‌లు..

గమనించిన స్థానికులు ఎలుగుపై రాళ్లువిసిరారు. ఆగ్రహించిన బల్లూకం.. వారిపైకూడా దాడికి దిగింది. దీంతో మరో ఇద్దరు గాయపడ్డారు. క్రమంగా జనాలు గుమకూడటంతో భయంతో అక్కడి నుంచి అడవిలోకి పరుగులు తీసింది. సమాచారం అందుకున్న అటవీ అధికారులు అక్కడి చేరుకున్నారు. గాయపడినవారిని దవాఖానకు తరలించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube