సర్వాంగ సుందరంగా శ్రీవారి మెట్ల మార్గం

సర్వాంగ సుందరంగా శ్రీవారి మెట్ల మార్గం

0
TMedia (Telugu News) :

సర్వాంగ సుందరంగా శ్రీవారి మెట్ల మార్గం

లహరి, ఫిబ్రవరి 9,తిరుపతి : కలియుగ ప్రత్యక్ష దైవంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని పిలుచుకుంటారు. ఆ దేవదేవుడి దగ్గరికి కాలినడకన వెళ్లి దర్శించుకుంటే.. కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే నడకదారిని ఎంతో పవిత్రంగా భావిస్తుంటారు. భక్తులు నడిచి వెళ్లే దారిలో ఎండకు, వర్షానికి రక్షణ ఇచ్చేలా మూడు దశాబ్ధాల కిందట టీటీడీ షెల్టర్లను ఏర్పాటు చేసింది. అయితే.. ఈ షెల్టర్లు పాతబడ్డాయి. వర్షం వస్తే భక్తులు తడుస్తున్నారు. దీంతో మెట్ల మార్గానికి మరమ్మతులు చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.ఏడున్నర కిలో మీటర్లలో ఉన్న తిరుమల కాలిబాటను.. మరింత అభివృద్ధి చేయడానికి టీటీడీ నిర్ణయం తీసుకుంది. మొత్తం 25 కోట్ల రూపాయల ఖర్చుతో.. పాడైపోయిన షెల్టర్లను తొలగించి వాటి స్థానంలో కొత్త షెల్టర్లను ఏర్పాటు చేశారు.

Also Read : అంగరంగ వైభవంగా సమతా కుంభ్‌ ఉత్సవాలు

నడకదారిలో భక్తులకు అవసరమైన విశ్రాంతి సముదాయాలు, టాయిలెట్స్, తాగునీటి జలప్రసాద కేంద్రాలను అవసరమైన దగ్గర ఏర్పాటు చేశారు. ఇప్పుడున్న షెల్టర్లను పిల్లర్లతో సహా తొలగించి.. వాటి స్థానంలో కొత్త వాటిని నిర్మించింది. నడకదారి లో భక్తుల రద్దీ తక్కువగా సమయంలో.. మరమ్మతు పనులను వేగంగా చేపట్టింది. దీంతో ప్రముఖులు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube