ముఖం మీద గుంటలతో ఇబ్బంది పడుతున్నారా

ఇది మీకోసమే...

1
TMedia (Telugu News) :

ముఖం మీద గుంటలతో ఇబ్బంది పడుతున్నారా ?

– ఇది మీకోసమే…

టీ మీడియా,సెప్టెంబర్ 5,వైద్య విభాగం:

ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా చర్మ సమస్యలు ఎదురవు తున్నాయి. ముఖ్యం ముఖం పై మొటిమలు, మచ్చలు, గుంటలు వంటిలవి. ముఖ్యం గా ముఖంపై ఏర్పడే గుంటల వలన ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. చర్మం మీద ఉండే చిన్న రంథ్రాలు విస్తరించినప్పుడు సేబాషియస్ గ్రంథి ఏర్పడుతుంది. ఇది చర్మాన్ని రక్షించేందుకు నూనెలను విడుదల చేస్తుంది. అయితే, కొంతకాలం తర్వాత ఆ నూనెలే చర్మానికి ప్రతికూలంగా మారతాయి. చిన్న రంథ్రాలను సాగదీస్తాయి. కొన్నాళ్ల తర్వాత అవి పెద్దవిగా మారి అందహీనంగా మరతాయి. కానీ వాటిని మయం చేయడానికి కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది. అవెంటో తెలుసుకోండి.

Also Read : వైద్య ఆరోగ్య శాఖలో కోవిడ్ కుంభకోణం

పసుపు

సాధారణంగా అందానికి ఉపయోగించడంలో ముందుంటుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు గుంతలలో ఉండే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. దీంతో గుంతలను క్రమంగా తొలగించేయొచ్చు. ఒక టీ స్పూన్ పసుపుకు కొద్దిగా నీళ్లు కలిపి పేస్టులా చేసుకోండి. దాన్ని ముఖానికి రాయండి. పది నిమిషాల తర్వాత చల్లని నీటితో ముఖాన్ని కడిగేయండి.

సాధారణంగా మనం ఓట్స్ ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా ఉపయోగిస్తుంటాం. అయితే ఓట్స్ చర్మ సంరక్షణకు కూడా చాలా బాగా సహయపడతాయి. చర్మంపై ఉండే ఆయిల్, అలాగే రంథ్రాలు, గుంతల పరిమాణాన్ని తగ్గిస్తుంది. రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్‌లో ఒక టేబుల్ స్పూన్ పాలు కలపాలి. ఆ మిశ్రమాన్ని చర్మానికి రాయండి. బాగా ఆరిన తర్వాత మీ ముఖాన్ని కాసేపు రుద్దండి. అనంతరం చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి.

 

Also Read : నేడుబి.ఆర్ అంబేద్కర్ సేవాసమితి ప్రారంభం

ముఖంపై ఉండే రంథ్రాలను దూరం చేయడానికి దోసకాయ బాగా పనిచేస్తుంది. ఇందులో ఉండే సిలికా మీ చర్మానికి యవ్వనాన్ని అందించడమే కాకుండా పెద్ద రంథ్రాలను దగ్గరకు చేస్తాయి. వీటికి నిమ్మరసం చేర్చినట్లయితే మరింత మెరుగైన ఫలితాలను చూడవచ్చు.

నిమ్మ కూడా:
గుంతలను మాయం చేయడంలో కీలకంగా పనిచేస్తుంది. రెండు టేబుల్ స్పూన్ల దోసకాయ రసంలో ఒక స్పూన్ నిమ్మరం కలపండి. ఆ రసాన్ని దూది(కాటన్ బాల్స్)తో ముఖానికి అద్దండి. అది బాగా ఆరిన తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి.
అరటి పండు తొక్కను ఎందుకు పనికిరాదని పడేయకండి. ఇది కూడా ముఖంపై రంథ్రాలను పూడ్చడంలో కీలకంగా పనిచేస్తుంది. ఎందుకంటే అరటి పండు తొక్కలో లుటీన్ ఉంటుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మ పోషణకు సహకరిస్తాయి. అరటి తొక్కలో ఉండే పొటాషియం చర్మంపై మచ్చలను తొలగిస్తుంది. అరటి పండు తొక్కను మీ చర్మం మీద గుండ్రంగా రుద్దండి. ఇలా15 నిమిషాలు చేసి ఆ తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా చేస్తుంటే ముఖం మీద ఏర్పడిన పెద్ద రంథ్రాలు క్రమేన మాయమవుతాయి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube