కొండగట్టు దొంగలను పట్టించిన బీరుసీసాలు
టీ మీడియా, మార్చి 2, జగిత్యాల జిల్లా : కొండగట్టు ఆలయంలో దొంగ తనానికి పాల్పడిన దొంగలను బీరు సీసాలు పట్టించాయని తెలుసా..వివరాల్లోకి వెళ్తే దొంగ తనానికి వచ్చి న దొంగలు బీర్లు తాగి సీసాలను ఆలయ పరిసరాల్లో వదిలేయగా పోలీసు జాగిలం రాబిన్ గుర్తించింది. వెంటనే సీసాలపై ఉన్న వేలి ముద్రలను ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించి నిందితుల ఆధార్ ను పోలీసులు గుర్తించారు. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ చెందిన దొంగల ను జిల్లా ఎస్పీ భాస్కర్ ఆద్వర్యంలో పోలీసులు 10బృందాలుగా ఏర్పాడి దొంగలను పట్టుకున్నారు.