బిచ్చగత్తె మానవత్వం

అనాథ బాలికను దత్తత,దేవుడి గుడి లక్ష విరాళం

1
TMedia (Telugu News) :

బిచ్చగత్తె మానవత్వం

-అనాథ బాలికను దత్తత,దేవుడి గుడి లక్ష విరాళం

లహరి, డిసెంబర్19, ప్రతినిధి : తన జీవనోపాధి కోసం బిక్షాటన చేసే ఓ వృద్ధురాలు మానవత్వం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ఒడిశాకు చెందిన 70 ఏళ్ల వృద్ధురాలు నిస్వార్థ కార్యం, సర్వశక్తిమంతుడైన భగవంతుడికి పట్ల భక్తితో వార్తల్లో నిలిచారు. కొంతమంది ఎవరికైనా ఏమైనా పెట్టాలంటే.. మా దగ్గర ఏముంది అని అంటారు.. అయితేఎదుటివారికి సాయం చేయాలంటే.. కావాల్సింది.. డబ్బులు కాదు.. సాయం చేసే మనసు.. అది ఉంటె.. తనకు ఉన్నదానిలోనే ఇతరులకు సాయం చేస్తారు. అందుకు ఉదాహరణగా అనేక సంఘటలు నిలుస్తున్నాయి.. తరచుగా అటువంటి వ్యక్తులకు సంబంధించిన వీడియోలు, వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. తన జీవనోపాధి కోసం బిక్షాటన చేసే ఓ వృద్ధురాలు మానవత్వం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ఒడిశాకు చెందిన 70 ఏళ్ల వృద్ధురాలు నిస్వార్థ కార్యం, సర్వశక్తిమంతుడైన భగవంతుడికి పట్ల భక్తితో వార్తల్లో నిలిచారు.


ఒడిశా కంధమాల్ జిల్లాలోని ఫుల్బానీలో ఉన్న జగన్నాథ ఆలయానికి భిక్షాటన ద్వారా సంపాదించిన లక్ష రూపాయలను విరాళంగా ఇచ్చారు. ఫుల్బానీకి చెందిన తులా బెహెరా కంధమాల్ పట్టణంలోని వీధుల్లో గత కొన్నేళ్లుగా భిక్షాటన చేస్తూ జీవిస్తున్నది. గత కొన్నేళ్ల క్రితం శారీరక వికలాంగుడైన తన భర్తతో కలిసి బిక్షాటన చేయడం ప్రారంభించింది. తన భర్త ప్రఫుల్ల బెహెరాతో కలిసి భిక్షాటన కోసం ఇంటింటికీ తిరిగేది. ఐతే భర్త మరణించాడు.. ఇక బెహెరా గురించి పట్టించుకునే బంధువులు, బంధాలు లేకపోవడంతో ఒంటరి అయ్యింది బామ్మ. ఫుల్బానీ పట్టణంలోని జగన్నాథ ఆలయం, సాయి ఆలయం, ఇతర ఆలయాల ముందు కూర్చుని భిక్షను కోరుతూనే ఉంది. అంతేకాదు నిరాశ్రయులైన ఒక అమ్మాయిని కూడా దత్తత తీసుకుంది. ఇప్పుడు ఇద్దరూ ఆలయాలను సందర్శించే భక్తుల నుండి స్వీకరించే భిక్షతో జీవిస్తున్నారు.జగన్నాథుని పరమ భక్తురాలైన తులా బెహెరా ఎప్పటి నుంచో ఆలయానికి ఏదైనా విరాళం ఇవ్వాలని ఆలోచిస్తున్నది. ఇటీవల తులా ఖాతాలో పొదుపు లక్ష రూపాయలు దాటిందని బ్యాంకు అధికారులు ఆమెకు తెలియజేశారు. దీంతో ఆమె పట్టణంలోని జగన్నాథ స్వామి ఆలయ పునరుద్ధరణకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఆలయ నిర్వాహకులకు విరాళం అందించినప్పుడు.. వారు మొదట్లో బిచ్చగత్తె అంటూ డబ్బును స్వీకరించడానికి ఇష్టపడలేదు.

Also Read : పెరుగు తింటే జలుబు చేస్తుందా

అయితే తులా బెహెరా కు భగవంతునిపై ఉన్న భక్తిని చూసి తాము విరాళం స్వీకరించడానికి అంగీకరించామని ఆలయ నిర్వహణ కమిటీ అధ్యక్షుడు సునాసిర్ మొహంతి తెలిపారు.తాను భిక్షాటన చేసి కొన్నాళ్లు డబ్బును పొదుపు చేశానని తనకు కుటుంబం లేదు. ఇప్పుడు జీవితంలో చివరి దశలో ఉన్నా.. తనకు డబ్బు అవసరం లేదని తులా బెహెరా చెప్పారు. నిజానికి, జగన్నాథునికి నేను ఏదైనా సేవ చేయగలిగితే.. ఈ భూమిపై తన జీవిత లక్ష్యం నెరవేరినట్లు భావిస్తాన ”అని తుల ఒడిషా టెలివిజన్ తో చెప్పారు. శుక్రవారం ధనువు సంక్రాంతి సందర్భంగా ఆలయానికి రూ.లక్ష విరాళం అందించగా.. ఆలయ నిర్వహణ కమిటీ ఆమెకు సన్మానం కూడా చేశారు. ‘‘ఆలయ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ డబ్బును వినియోగిస్తామని చెప్పారు. ఆలయానికి ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా జీవితకాలం తులా బెహెరకు ప్రసాదం అందించాలని తాము నిర్ణయించుకున్నాము” అని మొహంతి చెప్పారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube