ధనుర్మాసం ప్రారంభం.. ఈనెల రోజుల్లో శుభకార్యాలను వాయిదా

ధనుర్మాసం ప్రారంభం.. ఈనెల రోజుల్లో శుభకార్యాలను వాయిదా

1
TMedia (Telugu News) :

ధనుర్మాసం ప్రారంభం.. ఈనెల రోజుల్లో శుభకార్యాలను వాయిదా

లహరి, డిసెంబర్ 17, ప్రతినిధి : హిందూ మత విశ్వాసాల ప్రకారం, ధనుర్మాసం మతపరమైన ఆరాధన, తీర్థయాత్రలకు ఎంతో కీలకమైనది. ఈ సమయంలో సూర్యుడు దక్షిణాయాణం చివర్లో, ఉత్తరాయన ప్రారంభంలో ఉంటాడు. ఈ కాలంలో చలి తీవ్రత మరింత పెరుగుతుంది. ధను సంక్రాంతి సమయంలో విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అయితే శుభకార్యాలను మాత్రం సరిగ్గా నెలరోజుల పాటు వాయిదా వేసుకుంటారు. అయితే ఆగమ శాస్త్రం ప్రకారం ఈ మాసంలో ఆండాళ్ పూజ, తిరుప్పావై పఠనం, గోదా దేవి కళ్యాణం వంటి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ధనుర్మాసానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం…


​తిరుప్పావై అంటే..
తెలుగు పంచాంగం ప్రకారం, మార్గశిర మాసంలో పౌర్ణమి తర్వాత పాడ్యమి నుంచి వైష్ణవులు ధనుర్మాస వ్రతాన్ని ప్రారంభిస్తారు. ఈ మాసం విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనది. ఈ కాలంలోనే గోదాదేవి మార్గళి వ్రతం చేసి నారాయణుడిని ఆరాధించింది. ధను సంక్రమణ కాలంలో నదీ స్నానాలు, పూజలు, జపాలు చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయని చాలా మంది నమ్ముతారు. ఈ నెలలో బ్రహ్మ ముహుర్తంలో నారాయణ పారాయణం చేసిన వారు దైవానుగ్రహాన్ని పొందుతారని శాస్త్రాలలో పేర్కొనబడింది. సాక్షాత్తు భూదేవి అవతారమైన అండాళ్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. ద్రవిడ భాషలో తిరు అంటే పవిత్రం.. పావై అంటే వ్రతం అని అర్థం. వేదాలు, ఉపనిషత్తుల సారమే తిరుప్పావై అనిహిందూ పురాణాల్లో పేర్కొనబడింది.​ఇంటి ముందు గొబ్బెమ్మలతో..

 


ధనుర్మాసంలో శ్రీ విష్ణుమూర్తిని మధుసూదన పేరిట పూజిస్తారు. ఈ నెలలో తొలి పక్షం రోజుల పాటు చక్కెర పొంగలి లేదా పులగం నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తర్వాత పక్షం రోజుల పాటు దద్యోజనం నైవేద్యంగా సమర్పించాలి. ఈ కాలంలో పెళ్లి కాని కన్యలు తమ ఇంటి ముందు ముగ్గులు, గొబ్బెమ్మలతో పూజలు చేయడం వల్ల తమ కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ మాసంలోనే గోదాదేవి మార్గళి వ్రతం పేరిట మహా విష్ణువును పూజించి మోక్షం పొందింది. ఈ ధనుర్మాసం వ్రత వివరాలు బ్రహ్మాండ, ఆదిత్య పురాణాలు, భాగవతం, నారాయణ సంహితాల్లోనూ కనిపిస్తాయి.

Also Read : ఉజ్జయిని మహంకాళి దేవస్థానానికి ఫుడ్ సేఫ్టీ లైసెన్స్‌

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube