కోళ్ల ఫారంలో బెల్ట్ షాపులు

కోళ్ల ఫారంలో బెల్ట్ షాపులు

1
TMedia (Telugu News) :

కోళ్ల ఫారంలో బెల్ట్ షాపులు

టీ మీడియా, సెప్టెంబర్ 28, మధిర: మండలం తొండల గోపవరం గ్రామ శివారులో బండి భాను ప్రకాష్ కోళ్ల ఫారం నిర్వహిస్తూ అందులో విచ్చలవిడిగా రెండు బెల్ట్ షాపులను నిర్వహిస్తు రోజు 70 వేల రూపాయల సరుకు అమ్మడం విశేషం. ఈ విషయమై స్థానిక సెక్రటరీని వివరణ కోరగా కోళ్ల ఫారం కు సంబంధించిన పత్రాలు కార్యాలయంలో లేవని అందుచే ఆ కోళ్ల ఫారం కు ఎటువంటి అనుమతులు లేవని కోళ్ల ఫారం లోని ఒక గది షట్టర్ ఏర్పాటు చేసి విచ్చలవిడిగా అధిక ధరకు మద్యం విక్రయిస్తున్నట్లు తెలిపారు.

Also Read : డెంగ్యూ వ్యాది పై అవగాహన

ఆంధ్ర తెలంగాణ సరిహద్దు పరిసర ప్రాంతాలలో ఇలాంటి బెల్ట్ షాపు ను నిర్వహించడంతి వాహనదారులకు చాలా ప్రమాదకరంగా ఉంటుందని అనేకసార్లు పలు సంఘటనలు చోటుచేసుకున్నాయని అదే విధంగా ప్రతిరోజు ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు మద్యం విక్రయిస్తున్న సంబంధిత అధికారులు గానీ ఎటువంటి చర్యలు తీసుకోపోవడం వెనుక అధికారుల హస్తం కూడా ఉందా ఏమో అని గ్రామస్తులు వాదన ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే ఇటువంటి పెద్ద బెల్ట్ షాపులను వెంటనే సీజ్ చేసి మరి ఎవరు బెల్ షాపు నిర్వహించాలని ఆలోచన రానీకుండా ఉన్నతాధికారులు సంబంధిత అధికారులు నిర్వాహకులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube