ఈ సంఘాలు ఉండి ఎవరికి లాభం

ఈ సంఘాలు ఉండి ఎవరికి లాభం

1
TMedia (Telugu News) :

ఈ సంఘాలు ఉండి ఎవరికి లాభం

టీ మీడియా, డిసెంబర్ 6, వనపర్తి బ్యూరో : ఒక్కడికైనా సహాయం జరిగిందా మన వెనుక ఉన్నారనే ధైర్యం అయిన ఇస్తారా ఏ సంఘమైన తమ ఉనికిని కాపాడుకోవడానికి ఎన్నో ఎత్తులు, జిమ్మిక్కులు, తప్ప గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఎదిగిన సంఘాలు భవన నిర్మాణ కార్మికులను ఏరోజైనా గుర్తించారా కనీసం వాడు ఎలా జీవిస్తున్నాడు ఉండటానికి ఇల్లు ఉందా లేదా అనే విషయాలు వీరికి గుర్తు రావు ఐదో తారీకు, ఆదివారం, మొదటి మంగళవారం ఇలా పనిచేయకూడదు. అనే తాపీ సంఘాలు, ఎలక్ట్రిషన్, పెయింటర్, ప్లంబర్ వంటి సంఘాలు పని చేస్తే ఫైన్ అడగడం సంఘాలకు పరిపాటిగా మారింది. భవన నిర్మాణ రంగంలో ఎవరైనా కార్మికుడు చనిపోతే ఈ సంఘాలు ఎవడికి కూడా పైసా సహాయం చేసి ఒక పూలదండ వేసిన సందర్భాలు లేవు. బీడీ, చేనేత కార్మికులకు చాకలి మంగలి కులాలకు విద్యుత్ సౌకర్యంతో పాటు వారి వృత్తిరీత్యా జీవించుటకు రుణాలు అందిస్తున్నారు. కానీ వాటి గురించి ఏ సంఘాలు వెళ్ళవు అడగవు. మరి ఈ సంఘాలు ఎవరికోసం ఎందుకోసం ఉన్నట్లు ఆలోచించాలి.

Also Read : గుజరాత్‌ ఎన్నికల్లో నోటా గుర్తుకు 5 లక్షలకుపైగా ఓట్లు

పనిచేస్తే కూలి వస్తుంది తప్ప ఇందులో ఉండి కోట్లు సంపాదిస్తాం ఏసి గదిలో జీవిస్తాం అనే ధోరణి ఏ కార్మికుల్లో లేదు.పనిచేస్తే వెళ్లి బంద్ చేయించడం కాదు సంఘాల పని వారి సమస్యలు పరిష్కరించడంలో కూడా ముందు ఉండాలి లేబర్ కార్డు లేని కార్మికులకు కార్డులు తీపియాలి, రెన్యువల్ చేయించాలి అప్పుడే ఆ సంఘాలకు గుర్తింపు ఉంటుంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube