భోజనం తర్వాత మజ్జిగ తాగితే కలిగే ప్రయోజనాలు..

భోజనం తర్వాత మజ్జిగ తాగితే కలిగే ప్రయోజనాలు..

0
TMedia (Telugu News) :

భోజనం తర్వాత మజ్జిగ తాగితే కలిగే ప్రయోజనాలు..

లహరి, మార్చి 3, ఆరోగ్యం : మెరుగైన ఆరోగ్యం కోసం ఆస్పత్రులకు వెళ్లి వేలకు వేలు తగలబెట్టాల్సిన అవసరం లేదు. మన నిత్యం వంట గదిలో వాడే వాటినే సరిగ్గా ఉపయోగించుకుంటే చాలు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. అయితే చాలా మంది వాటిని ఉపయోగించుకోవడం ఎలాగో తెలియక.. జంక్ ఫుడ్స్‌కు అలవాటు పడి తమ ఆరోగ్యాన్ని చేజేతులా పాడు చేసుకుంటున్నారు. ఇక మన వంటింటిలో వాడే చాలా ఆహార పదార్దాలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. వాటిలో మనకి నచ్చే శీతల పానీయం కూడా ఉంది.. అదే మజ్జిగ. మజ్జిగ లేదా బట్టర్ మిల్క్, లస్సీ, సల్ల అని ఏ పేరుతో పిలుచుకున్నా దాని ప్రయోజనాలు అమోఘమే. ఇక వేసవి కాలం సమీపిస్తున్న ఈ తరుణంలో ఒక గ్లాసు మజ్జిగ మీ కడుపుకు మంచి ఉపశమనం కలిగించే పానీయం. లంచ్ లేదా డిన్నర్ తర్వాత దీన్ని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా ఎసిడిటీని నివారిస్తుంది. మజ్జిగ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను మరింత మెరుగుపరచడానికి అందులో మిరియాలు, ధనియాల పొడి, కల్లుప్పు, శొంఠి వంటి కొన్ని మసాలా దినుసులను కలిపి తీసుకోవచ్చు. మజ్జిగలో కేలరీల తక్కువ ఉంటాయి కాబట్టి అధిక బరువు తగ్గించచుకోవడానికి ఇది మంచి పానీయం. అయితే భోజనం తర్వాత మజ్జిగను తాగడం వల్ల ఇంకా ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Also Read : హోలీకి ముందే ఈ వస్తువులు బయట పడెయ్యండి.

జీర్ణశక్తి: మజ్జిగ మన జీర్ణవ్యవస్థకు ఒక వరం. మజ్జిగలో ఉండే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా, లాక్టిక్ యాసిడ్ జీర్ణక్రియను, జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
IBS నుంచి రిలీఫ్: పెద్దపేగుల్లో అసాధారణ కదలికల వల్ల మల విసర్జనలో తీవ్ర ఇబ్బందులు కలుగజేసే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్‌ వ్యాధి నివారణలో మజ్జిగ సహాయపడుతుంది. అందులోని యాసిడ్ కారణంగా మీ పొట్టను క్లియర్ చేస్తుంది. దీనిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ వంటి జీర్ణ రుగ్మతలను తగ్గించవచ్చు.

ఆసిడిటీ: మజ్జిగ తీసుకోవడం వల్ల ఆసిడిటీని నివారించవచ్చు. మజ్జిగలో శొంఠి లేదా మిరియాలు వంటి మసాలా దినుసులను కలిపి తాగడం వలన ఆసిడిటీని దూరం చేయవచ్చు.

రోగనిరోధక శక్తి: ఆరోగ్యకరమైన ప్రేగులు బలమైన రోగనిరోధక శక్తికి పునాది. మజ్జిగ ఆరోగ్యకరమైన పేగులకు అవసరమయ్యే పోషణ అందిస్తుంది. ఇది జీర్ణక్రియ నుంచి రోగనిరోధక శక్తి వరకు అన్నింటిని సెట్ చేస్తుంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube