బెంగాల్ హడలగొడుతున్న నైరోబీ ఈగ

బెంగాల్ హడలగొడుతున్న నైరోబీ ఈగ

1
TMedia (Telugu News) :

బెంగాల్ హడలగొడుతున్న నైరోబీ ఈగ

టి మీడియా, జులై7,కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ను గత కొద్దిరోజులుగా ఈగలు హడలెత్తిస్తున్నాయి. ఆఫ్రికాకు చెందిన నైరోబీ ఫ్లై లేదా యాసిడ్‌ ఫ్లై అనే ఈగలు..
శిలిగుడి, డార్జిలింగ్‌ సహా పలు ప్రాంతాల ప్రజల చర్మంపై వాలి అస్వస్థతకు గురిచేస్తున్నాయి. దీంతో వందలాది జనం అనారోగ్యం బారినపడుతున్నారు. వీటి వల్ల అంత భయపడాల్సిన అవసరం లేదని, జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని వైద్యులు చెబుతున్నారు. ఈ ఆఫ్రికన్‌ ఈగ నారింజ, ఎరుపు, నలుపు..మూడు రంగుల్లో ఉంటుంది. ఈ కీటక శరీరంలో పెడిటిన్‌ అనే ఆమ్ల పదార్థం (యాసిడ్‌) ఉంటుంది. ఇది మానవ చర్మానికి హాని కలిగిస్తుంది. ఉత్తరాదిలో హిమాలయాల దిగువన అధిక వర్షపాతం కారణంగా అక్కడ తిరుగుతున్నాయి.

 

Also Read :‘గని’ పంచ్‌ ఎలా ఉందంటే.

గతేడాది కంటే ఈ సంవత్సరం వర్షపాతం ఎక్కువగా నమోదవడం వల్ల యాసిడ్‌ ఈగల సంచారం అసాధారణ స్థాయిలో పెరిగింది. వాస్తవానికి ఈ కీటకాలు చర్మంపై కుట్టవు. ఒంటిపై వాలినప్పుడు వాటిని కొడితే మాత్రం రసాయనం లాంటి పదార్థాన్ని విడుదల చేస్తాయి. దీని కారణంగా చర్మంపై దద్దుర్లు వస్తాయి.ఆ తర్వాత అది అంటువ్యాధిలా మారే అవకాశం ఉంది. బాధితుల శరీరంపై నైరోబీ ఫ్లై దాడి చేస్తే ఆ పురుగు కుట్టినచోట విపరీతమైన మంట, తర్వాత తీవ్రంగా నొప్పి ఉంటుందని బాధితులు చెబుతున్నారు. దీనివల్ల జ్వరం బారిన పడుతున్నామని, వాంతులు కూడా అవుతున్నాయని తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube