ప్రొఫెసర్ “కవిత”కు” బెస్ట్ టీచర్” అవార్డ్…..

ప్రొఫెసర్ "కవిత"కు" బెస్ట్ టీచర్" అవార్డ్.....

1
TMedia (Telugu News) :

ప్రొఫెసర్ “కవిత”కు” బెస్ట్ టీచర్” అవార్డ్…..

డాక్టర్ కవిత కు “మండవ ఫౌండేషన్ “వారి బెస్ట్ టీచర్ అవార్డు.

వ్యవసాయ కళాశాల అధ్యాపకురాలికి “బెస్ట్ టీచర్ అవార్డ్.”

టీ మీడియా, జూన్ 15, మహానంది:

మహానంది వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ పి. కవిత మండవ ఫౌండేషన్ వారి ప్రతిష్టాత్మకమైన బెస్ట్ టీచర్ అవార్డ్ అందుకున్నట్లు వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఆచార్యఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గుంటూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం లో మంగళవారం నిర్వహించబడిన కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి మరియు ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ మిషన్ చైర్మన్ నాగిరెడ్డి గారి చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నట్లు ఆయన తెలిపారు.

Also Read : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి

డాక్టర్ కవిత గత 18 సంవత్సరాలుగా మహానంది వ్యవసాయ కళాశాలలో మృత్తిక శాస్త్ర విభాగంలో గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకుప ఉత్తమ బోధన అందిస్తున్నారని ఇంతవరకు డాక్టర్ కవిత పర్యవేక్షణలో ఆరుగురు విద్యార్థులు అగ్రికల్చర్ ఎమ్మెస్సీ పూర్తిచేశారని అందులో ఇద్దరు విద్యార్థులు గోల్డ్ మెడల్ సాధించారని,ప్రస్తుతం ఒక ఎమ్మెస్సీ విద్యార్థి మరియు ఒక పి.హెచ్.డి విద్యార్థి పరిశోధనలు చేస్తున్నారని ఆయన తెలిపారు . బోధనతో పాటు గతంలో ఆమె హాస్టల్ వార్డెన్ గా, ఎన్.ఎస్.ఎస్ ఆఫీసర్ గా, లైబ్రరీ ఇన్ఛార్జ్ గా, ప్లేస్మెంట్ ఆఫీసర్ గా ఉత్తమ సేవలు అందించారని ప్రస్తుతం కళాశాల అకడమిక్ విషయాల్లో ఆఫీసర్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

Also Read : మిత్రుడు కుటుంబానికి ఆర్థిక సహాయం

ఈ సందర్భంగా డాక్టర్ కవిత మాట్లాడుతూ తాను వ్రాసిన 70 పరిశోధన పత్రాలు వివిధ జాతీయ అంతర్జాతీయ జర్నల్స్ లో ప్రచురించబడ్డాయని కళాశాల అధ్యాపకుల విద్యార్థుల ప్రోత్సాహం, సహకారంతోనే తన వృత్తిలో రాణించి ఈ అవార్డు సాధించినట్లు పేర్కొన్నారు. తమ కళాశాల అధ్యాపకురాలి ప్రతిభను గుర్తించి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందజేసిన యూనివర్సిటీ వారికి మరియు మండవ ఫౌండేషన్ వారికి కళాశాల సిబ్బంది ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా కళాశాలకు అవార్డు తీసుకొచ్చిన డాక్టర్ కవిత ను ప్రొఫెసర్లు, సిబ్బంది విద్యార్థులు అభినందించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube