పౌష్టికాహారం తోనే మెరుగైన ఆరోగ్యం… కౌన్సిలర్ మల్లాది వాసు

0
TMedia (Telugu News) :

టీ మీడియా, నవంబర్ 09, మధిర:

పౌష్టికాహారం తోనే గర్భిణీలు శిశువులు బాలింతలు ఆరోగ్యంగా ఉంటారని పదవ వార్డు కౌన్సిలర్ మల్లాది వాసు పేర్కొన్నారు. మంగళవారం 10వ వార్డులో ఉన్న మినీ అంగన్వాడీ కేంద్రంలో పోషణ అభియాన్ వారోత్సవాల్లో భాగంగా తల్లులకు పిల్లలకు పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మల్లాది వాసు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీ స్త్రీలకు 6 సంవత్సరాలలోపు పిల్లలకు బాలింతలకు ప్రభుత్వం పౌష్టికాహారాన్ని అందిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ శశి అంగన్వాడి టీచర్లు ఇందిరా, ఉష, అర్పి ప్రతిమ తదితరులు పాల్గొన్నారు.

Better health with nutrition Councilor Malladi Vasu.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube