మహాలక్ష్ములు తస్మాత్ జాగ్రత్త

ప్రయాణంలో పొంచి ఉన్న అపాయం

0
TMedia (Telugu News) :

మహాలక్ష్ములు తస్మాత్ జాగ్రత్త

-ప్రయాణంలో పొంచి ఉన్న అపాయం

-మహిళా మణులు అపరిచితులతో జరభద్రం

టీ మీడియా, డిసెంబర్ 12, అశ్వారావుపేట : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహాలక్ష్మి పథకానికి రాష్ట్రవ్యాప్తంగా మహిళల నుండి ఎంత ఆదరణ వస్తుందో చూస్తూనే ఉన్నాం. ఈ పథకం ద్వారా మహిళా ఉద్యోగులు, చదువుకునే విద్యార్థినిలు, పట్టణాలలో చిన్న చిన్న షాపులలో పనిచేసే మహిళా మణులు ఒకరేంటి మహిళా మణులు అందరూ కూడా ఈ ఉచిత రవాణా సర్వీస్ కు ఆకర్షితులయ్యారు. ఈ క్రమంలో గతంలో కన్నా ఈ పథకం అమలు నాటి నుండి బస్సులలో రద్దీ రోజురోజుకీ పెరిగిపోతుంది.

బస్సులన్ని కిటకిటలాడుతున్నాయి. మునుపటి కన్నా ఇప్పుడు బస్సులలో ప్రయాణించడానికి ఎక్కువమంది ఆసక్తి చూపడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రయాణికుల ప్రాంగణాలన్నీకూడా ప్రజలతో ముఖ్యంగా మహిళలతో కిక్కిరిసిపోయి ఉంటున్నాయి. ఇదే అదునుగా తీసుకున్న కొందరు కేటుగాళ్లు రద్దీ ఉండే ప్రాంతాలైన బస్టాండ్లు,కిక్కిరిసిన బస్సులలో వీరు దొంగతనాల కు పాల్పడే అవకాశం మెండుగా ఉంటాయి. ఇప్పటికే రాష్ట్రంలో పలుచోట్ల ఇటువంటి దొంగతనాలకు పాల్పడుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తుంది.అశ్వారావుపేట లో కూడా ఆ మధ్యకాలంలో ద్విచక్ర వాహనాలపై వచ్చి ఆడవాళ్ళ మెడలలో గొలుసులు లాక్కున్న సందర్భాలు ఉన్నాయి.

Also Read : పల్లకి సేవలో పాల్గొన్న ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి

 

కావున ప్రయాణం చేసేటప్పుడు మహిళలు వారి హ్యాండ్ బ్యాగులు,మెడలో బంగారపు చైన్లు విలువైన వస్తువులపై మహిళలు తగు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి. దొంగతనం చేసే వాళ్ళు మగవారే కానక్కర్లేదని ఆడవారిలో కూడా ఈ తరహా దొంగతనాలు చేయటంలో ఆరి తేరిన వారు ఉన్నారని సంగతి మహాలక్ష్ములు మర్చిపోవద్దు. లేనిచో ఉచిత సర్వీసు అని ఆశపడ్డందుకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదనీ ఈ సందర్భంగా టీ మీడియా కోరుతుంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube