భద్రాద్రి హుండీ ఆదాయం లెక్కింపు

భద్రాద్రి హుండీ ఆదాయం లెక్కింపు

1
TMedia (Telugu News) :

భద్రాద్రి హుండీ ఆదాయం లెక్కింపు

టి మీడియా,జులై7,భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం సీతారామచంద్రస్వామి హుండీ ఆదాయం రూ.1.82 కోట్లు వచ్చింది. రామాలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో బుధవారం ఆలయ హుండీల లెక్కింపు నిర్వహించారు. ఇందులో రూ.1,82,33,186 నగదు, 130గ్రాముల బంగారం, ఒక కేజీ 900 గ్రాముల వెండి, 467 అమెరికా డాలర్లు, 10 యూఏఈ దీరామ్స్‌, ఇతర దేశాల కరెన్సీ వచ్చింది.

Also Read : ఐదుగురు జీఎస్టీ అధికారులపై కేసు నమోదు

ఇదిలాఉండగా దేవస్థానం హుండీలను చివరిసారిగా మే 2న లెక్కించామని, 65 రోజుల అనంతరం హుండీ లెక్కింపు బుధవారం నిర్వహించినట్లు దేవస్థానం ఈవో బి.శివాజీ తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube