ముత్తంగి అలంకారంలో భద్రాద్రి రామయ్య

0
TMedia (Telugu News) :

టీ మీడియా, డిసెంబర్, 27, భద్రాచలం

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం లో సోమవారం రామయ్య కు ప్రత్యేక పూజలు జరిపారు. సోమవారం సందర్భంగా స్వామివారు ముత్తంగి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యధావిధిగా జరిపారు. ముందుగా విశ్వక్సేన ఆరాధన, కర్మణఃపుణ్యాహవాచన చేసి స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్రధారణం కార్యక్రమాలతో రామయ్యకు నిత్యకళ్యాణం జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Bhadrachalam Sri Sitaramachandra swamy performed special pujas for ramyana on Monday.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube