గాయత్రి విద్యానికేతన్ లో భగవద్గీత పఠన పోటీలు

గాయత్రి విద్యానికేతన్ లో భగవద్గీత పఠన పోటీలు

0
TMedia (Telugu News) :

గాయత్రి విద్యానికేతన్ లో భగవద్గీత పఠన పోటీలు

టీ మీడియా, డిసెంబర్ 20, పెద్దపల్లి : తిరుమల తిరుపతి దేవస్థానములు, హిందూ ధర్మ ప్రచార పరిషత్, పెద్దపల్లి జిల్లా వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గీతా జయంతి మహోత్సవములు – 2023 లో భాగంగా పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్ లో ఈ రోజు శ్రీమద్భగవద్గీతా కంఠస్థ (పఠన) పోటీలలో 3 వ అధ్యాయం కర్మ యోగము అనే అంశంలో నిర్వహించారు. ఈ పోటీలలో సుమారుగా 60 మందికి పైగా వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు పలు భగవద్గీత శ్లోకాలను పఠించి వీక్షకులను భక్తి పారవశ్యంలో తరింపజేశారు. ఈ సందర్భంగా గాయత్రి విద్యా సంస్థల ఛైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ మాట్లాడుతూ.. హిందూ ధర్మం పట్ల , భగవద్గీత పట్ల పిల్లలకు అవగాహన కల్పించి, వారితో శ్లోకాలను కంఠస్థం చేయించడం వలన పిల్లల్లో పఠనాసక్తి, జ్ఞాపశక్తిని పెంపొందించేలా తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్న ఈ పోటీలు అభినందనీయం అన్నారు.

Also Read : చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌ చేసిన హైకోర్టు

ఈ పోటీలలో జూనియర్ విభాగంలో కె. సొహల్య ప్రథమ, ఆర్. దివిజ ద్వితీయ, కె. సహల తృతీయ బహుమతి మరియు సీనియర్ విభాగంలో కె . సహస్ర ప్రథమ, పి. అభిరామ్ ద్వితీయ, జి. సాయి దుర్గ హర్షిని తృతీయ బహుమతి మరియు ఎన్. హాస్య , కె. సిరి లు ప్రత్యేక బహుమతులు సాధించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గాయత్రి విద్యా సంస్థల ఛైర్మన్ అల్లెంకి శ్రీనివాస్, కరస్పాండెంట్ రజనీ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ విజయ్, టిటిడి ప్రోగ్రామ్ అసిస్టెంట్ రాంరెడ్డి కృష్ణమూర్తి, టిటిడి ధర్మాచార్యులు నరెడ్ల సదయ్య, రామ్మోహన్ రావు, అంజలి పాల్గొన్నారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube