రాజస్థాన్‌ సీఎంగా భజన్‌లాల్‌ శర్మ ప్రమాణ స్వీకారం

రాజస్థాన్‌ సీఎంగా భజన్‌లాల్‌ శర్మ ప్రమాణ స్వీకారం

0
TMedia (Telugu News) :

రాజస్థాన్‌ సీఎంగా భజన్‌లాల్‌ శర్మ ప్రమాణ స్వీకారం

టీ మీడియా, డిసెంబర్ 15, రాజస్థాన్‌ : రాజస్థాన్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి గా భజన్‌లాల్‌ శర్మశుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. జైపూర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రా.. భజన్‌లాల్‌తో ప్రమాణం చేయించారు. ఆయనతోపాటు ఉపముఖ్యమంత్రులుగా దియా కుమారి, ప్రేమ్‌ చంద్‌ బైర్వాల ప్రమాణం చేశారు. మరికొంత మంది ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌, గజేంద్ర సింగ్‌ షెకావత్‌, నితిన్‌ గడ్కరీతోపాటు రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, పలువురు నేతలు పాల్గొన్నారు. ఇక రాజస్థాన్‌ మాజీ సీఎం, కాంగ్రెస్‌ నేత అశోక్‌ గెహ్లాత్‌ తదితరులు హాజరయ్యారు.

Also Read : భార్యా, పిల్లలను తుపాకీతో కాల్చి..

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube