ఘనంగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ 22వ వార్షికోత్సవ వేడుకలు.

ఘనంగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ 22వ వార్షికోత్సవ వేడుకలు

1
TMedia (Telugu News) :

 

ఘనంగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ 22వ వార్షికోత్సవ వేడుకలు.

రాష్ట్ర ఆరోగ్య శాఖమంత్రి తన్నీరు హరీష్ రావు ,హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ లతో కలసి పాల్గొన్న హాస్పిటల్ ట్రస్ట్ బోర్డు మెంబెర్, ఎంపీ నామ నాగేశ్వరరావు

టి మీడియా,జూన్23,హైదరాబాద్:

బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ యొక్క 22వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు హాస్పిటల్ ఆవరణలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి శ్రీ టి హరీష్ రావు, తెలంగాణా రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య, కుటుంభ సంక్షేమ శాఖ మంత్రి ముఖ్య అతిథిగా హాజరవ్వగా శ్రీ నందమూరి బాలకృష్ణ అధ్యక్షత వహించారు. వీరితో పాటూ ట్రస్టు బోర్డు సభ్యులు, ఎంపీ శ్రీ నామ నాగేశ్వర రావు, BIACH&RI; శ్రీ జెయస్ ఆర్ ప్రసాద్, ట్రస్టు బోర్డు సభ్యులు, BIACH&RI లతో పాటూ వైద్యులు, సిబ్బంది హాజరైనారు. పార్థనా గీత ఆలాపన, జ్యోతి ప్రజళ్వలన తో ప్రారంభమైన కార్యక్రమంలో ముందుగా సినీ గాయకులు బుర్రా విఖ్యాత సాయిరాం, రితిక ఆనంది లు స్వర్గీయ నందమూరి తారక రామారావు నటించిన సినీ గేయాలను ఆలపించి కార్యక్రమానికి హాజరైన శ్రోతలను అలరించారు.

Also Read : ఎన్ ఆర్ ఐ పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం

అనంతరం కార్యక్రమానికి హాజరైన ఆహూతులకు డా. ఆర్ వి ప్రభాకర రావు, CEO, BIACH&RI స్వాగతోపన్యాసం చేస్తూ గత ఏడాది కాలంలో సంస్థ సాధించిన ప్రగతిని వివరించారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి కాలంలో హాస్పిటల్ సిబ్బందికి వ్యాధి సోకకుండా తీసుకొన్న చర్యలన్ని వివరించారు. ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న క్యాన్సర్ రోగులకు నిరంతరాయంగా వైద్యమందేలా పలు చర్యలు తీసుకొన్నామని తెలిపారు. రోగులకు మంచి చికిత్స అందించడానికి ఎన్నో కొత్త సదుపాయాలను అందుబాటులోనికి తీసుకొచ్చినట్లు వివరించారు.

తర్వాత డా. టియస్ రావు, మెడికల్ డైరెక్టర్, BIACH&RI మాట్లాడుతూ క్యాన్సర్ వచ్చిన రోగులు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ను ఒక దేవాలయంగా భావిస్తారని అన్నారు. ఇక్కడకి వచ్చిన ప్రతి పేషెంట్ తమకు మంచి జరుగుతుందన్న నమ్మకంతో వస్తారని, కరోనా మహమ్మారి కాలంలో ఈ నమ్మకాన్ని హాస్పిటల్ లో పని చేస్తున్న సీనియర్ సిబ్బంది నుంచి జూనియర్ సిబ్బంది వరకూ వమ్ము చేయకుండా నిరంతరాయం నిర్భయంగా సేవలు అందించగలిగారని చెప్పారు. సంస్థ లో పని చేస్తున్న సిబ్బంది నిబద్దతకు ఇది ప్రకీత అని పేర్కొన్నారు.

Also Read : యాత్రను విజయవంతం చేయాలి

 

అనంతరం బోర్డు సభ్యులు శ్రీ నామ నాగేశ్వర రావు మాట్లాడుతూ ఇరవై సంవత్సరములు పూర్తి చేసుకోవడం చాలా పెద్ద విజయమని అయితే భవిష్యత్తులో వస్తున్న అవసరాలు, ఏర్పడుతున్న మార్పులు, చికిత్సలో వస్తున్న ఆధునికతను అందిపుచ్చుకొని పని చేసేందుకు సిబ్బంది సిద్దంగా ఉండాలని అన్నారు. తద్వారానే భవిష్యత్తులోనూ ఇలాంటి విజయాలను సాధించడానికి వీలవుతుందని చెప్పారు. సంస్థ పురోగతికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణా ప్రభుత్వం ఎంతగానో సహకరిస్తోందని మిగిలిన కొన్ని సమస్యలను త్వరలోనే పరిష్కరించే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు.

తర్వాత సీనియర్ బోర్డు సభ్యులు శ్రీ జెయస్ ఆర్ ప్రసాద్ మాట్లాడుతూ సంస్థ పురోగతికి దోహదపడిన పలువురు దాతలను గుర్తుకు చేసుకొంటూ వారు సరైన సమయానికి చేసిన సహాయం కారణంగానే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ సంస్థ ప్రారంభమై నేటికి ఈ దిశకు చేరుకుందని అన్నారు. వీరందరి ఆశయాలను వమ్ము చేయకుండా నిలబెట్టేలా సిబ్బంది పని చేయాలని సూచించారు.

Also Read : అమృత్ సరోవర్ మహోత్సవం కార్యక్రమంలోఎంపీపీ

అనంతరం సంస్థ ఛైర్మన్ శ్రీ నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ 1980 లలో భూమి పూజ జరిగినప్పటికి నాడు ఏర్పడిన పలు ఆటంకాలను తొలగించుకొంటూ ముందుకు సాగాల్సి వచ్చిందని అనంతరం నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో 2000 వ సంవత్సరములో 100 పడకల హాస్పిటల్ గా సంస్థ ప్రారంభమైనదని తెలిపారు. అలా 100 పడకల హాస్పిటల్ గా ప్రారంభమైన సంస్థ నేడు 550 పడకల స్థాయికి అభివృద్ది చెందిందని చెప్పారు. ఈ క్రమంలో ఎన్నో ఆటంకాలు, అవాంతరాలు దాటుకొని అవార్డులు, మన్ననలు పొందుతూ ముందుకు సాగడానికి యాజమాన్యం, దాతలు, వైద్యులు, సిబ్బంది కృషి ఉందని చెప్పారు. కరోనా కాలంలోనూ తర్వాత బ్లాక్ ఫంగస్ సమస్య తలెత్తినపుడు కూడా సంస్థ వైద్యులు అందించిన చికిత్స అందరి మన్ననలు అందుకొందని శ్రీ బాలకృష్ణ తెలిపారు. ఇదంతా సంస్థలో పని చేస్తున్న అందరి సమిష్టి కృషి కారణంగానే జరుగుతుందని, భవిష్యత్తులో అదే పంథా కొనసాగించాలని సూచించారు. ముఖ్యంగా తెలంగాణా ప్రభుత్వం హాస్పిటల్ అభివృద్దికి ఎంతగానో సహకారం అందిస్తోందని చెప్పారు.

చివరగా శ్రీ టి హరీష్ రావు, తెలంగాణా రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య, కుటుంభ సంక్షేమ శాఖ మంత్రి మాట్లాడుతూ రాజకీయ, సినిమా, సేవా రంగాలలో శ్రీ నందమూరి బాలకృష్ణ ప్రత్యేక గుర్తింపు సాధించడం ప్రశంసనీయమన్నారు. హాస్పిటల్ తో పాటూ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. అందుకే ఈ హాస్పిటల్ చేస్తున్న మంచి సేవలపై ముఖ్యమంత్రి గారు మంచి భావనతో ఉన్నారు. లాభాపేక్ష లేకుండా పని చేస్తే అతి కొద్ది హాస్పిటల్స్ లో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఒకటన్నారు. ఆరోగ్యశ్రీతో పాటూ ఆయుష్మాన్ భారత్ క్రింద సేవలు అందించి ఎంతో మంది ప్రాణాలను బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కాపాడుతోందని చెప్పారు. ప్రభుత్వ హాస్పిటల్స్ లో కూడా క్యాన్సర్ చికిత్సలను ప్రభుత్వ వైద్య కళాశాలలో అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలానే యం యన్ జె క్యాన్సర్ హాస్పిటల్ ను కూడా పూర్తి స్థాయిలో ఆధునిక హంగులు తీర్చిదిద్దుతున్నాం. నీతి ఆయోగ్ వారు ప్రత్యేకంగా బసవతారకం సేవలను గుర్తించి ప్రశంసించారు. ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాదుకు మెడికల్ టూరిజంలో అద్భుతమైన ప్రగతి సాధిస్తోందని చెప్పవచ్చు. బసవతారకం హాస్పిటల్ అభివృద్దికి ప్రభుత్వ తరపున, ఆరోగ్య శాఖ తరపున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

Also Read : నోటు పుస్తకాలు పంపిణీ చేసిన జె.ఎన్.టి.యు బృందం

అనంతరం చివరగా హాస్పిటల్ లో విద్యాభ్యాసం చేసిన డి యన్ బి విద్యార్థులు సాధించిన ప్రసిడెంట్ గోల్డ్ మేడల్స్ విజేతలకు, హాస్పిటల్ కు విరాళాలు అందిస్తున్న దాతలు, క్యాన్సర్ పై పోరాడి విజయం సాధించిన విజేతలకు మంత్రి హరీష్ రావు తో కలిసి శ్రీ నందమూరి బాలకృష్ణ సన్మానం చేశారు.

ఈ కార్యక్రమాలలో శ్రీ టి హరీష్ రావు, తెలంగాణా రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య, కుటుంభ సంక్షేమ శాఖ మంత్రి తో పాటూ శ్రీ నందమూరి బాలకృష్ణ, ఛైర్మన్, BIACH&RI; శ్రీ నామా నాగేశ్వర రావు, ట్రస్టు బోర్డు సభ్యులు, BIACH&RI; శ్రీ జెయస్ ఆర్ ప్రసాద్, ట్రస్టు బోర్డు సభ్యులు, BIACH&RI; డా. ఆర్ వి ప్రభాకర రావు, CEO, BIACH&RI; శ్రీ రవికుమార్, COO, BIACH&RI; డా. టియస్ రావు, మెడికల్ డైరెక్టర్, BIACH&RI; డా. ఫణి కోటేశ్వర రావు, మెడికల్ సూపర్నింటెండెంట్, BIACH&RI; డా. కల్పనా రఘునాథ్, ఆసోసియేట్ డైరెక్టర్ (అకడమిక్ & యాడ్ లైఫ్) లతో పాటూ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube