వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చెయ్యాలని భాస్కర్ రెడ్డి

0
TMedia (Telugu News) :

టీ మీడియా, నవంబర్ 11, ములుగు

జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు చింతలపూడి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు పండిచినటువంటి వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అడిషనల్ కలెక్టర్ వద్దకు వచ్చి మాట్లాడారు ఈ ధర్నా కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చింతలపూడి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ స్వరాష్ట్రం లో ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తారని ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకుంటే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ రైతులు పండిచినటువంటి ధాన్యాన్ని మొత్తం బస్తా దారం దబ్బనంతో సహా మేమె భరిస్తూ కొనుగోలు చేస్తున్నామని మాయ మాటలు చెప్పి ఈ రోజు తీరా ధాన్యం కల్లాలలోకి వచ్చేసరికి వరి వేస్తే ఊరే అని ధాన్యాన్ని మేము కొనలేము అని ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు రైతులు పండించిన ధాన్యం చివరి బస్తా కొనేవరకు బీజేపీ పార్టీ అండగా ఉంటుందని లేని పక్షంలో రాష్ట్రంలో రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ పెద్దఎత్తున ఆందోళనలు చేసి రైతులకు అండగా ఉంటామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ యొక్క కార్యక్రమంలో గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తాటి కృష్ణ, ప్రధాన కార్యదర్శులు నగరపు రమేష్, గాజుల కృష్ణ గౌడ్, జిల్లా,ఉపాధ్యక్షులు , ఏనుగు రవీందర్ రెడ్డి, కొండూరు నరేష్, అల్లే జనార్దన్, కార్యదర్శులు కర్ర సాంబశివరెడ్డి, శ్రీమంతుల రవీంద్రాచారి, జిల్లా అధికార ప్రతినిధి దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డి, కార్యాలయ కార్యదర్శి చల్లూరి మహేందర్,కిసాన్ మోర్చా జిల్లాఅధ్యక్షులు జీనుకల క్రిష్ణాకర్ రావు,యువ మోర్చా జిల్లా అధ్యక్షులు కొత్త సురేందర్,మహ్మద్ యాకుబ్ పాషా, భూక్య రాజ్ నాయక్ మండల అధ్యక్షులు ఇమ్మడి రాకేష్ యాదవ్, భూక్యా జవహర్, మద్దినేని తేజరాజ్, మల్లెల రాంబాబు, గండేపల్లి సత్యం, ఎర్రంగాని వీరన్ కుమార్,నాయకులు దొంతిరెడ్డి రాకేష్ రెడ్డి,సానికొమ్ము హరీష్ రెడ్డి,కొయిల కవిరాజ్, అంజిరెడ్డి ప్రమోద్ రెడ్డి, రవీందర్ రెడ్డి, సుదర్శన్ తిరుపతి,గద్దల రఘు, ఈక మహాలక్ష్మి, కారుపోతుల యాదగిరి, సుమన్,రాజశేఖర్, రాజ్ కుమార్,మేకల రమేష్ రావు, కిషన్ జీడి ప్రశాంత్, అనిల్ కుమార్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Bhaskar Reddy wants to buy grain immediately.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube