భట్టి విక్రమార్క దంపతుల ప్రత్యేక పూజలు
టీ మీడియా, ఫిబ్రవరి 18, మధిర : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మధిరలోని మహిమాన్విత శ్రీ మృత్యుంజయ స్వామి వారి ఆలయంలో శనివారం మధిర శాసనసభ్యులు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నందిని దంపతులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న వారికి ఆలయ చైర్మన్ వంకాయలపాటి నాగేశ్వరరావు,eo జగన్మోహన్రావు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు అనంతరం భట్టి విక్రమార్క దంపతులకు అర్చకులు ఆశీర్వచనాలు అందించగా ఆలయ చైర్మన్, ఈవో, కమిటీ సభ్యులతో కలిసి దుషాలువాతో సన్మానించారు.