భట్టి పాదయాత్రకు పలువురు సంఘీభావం

భట్టి దంపతులకు సన్మాణం

2
TMedia (Telugu News) :

భట్టి పాదయాత్రకు పలువురు సంఘీభావం

టీ మీడియా,మార్చి 5,ముదిగొండ :టిఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముదిగొండ మండలం పెద్దమండవ గ్రామాంలో శనివారం నిర్వహించిన పాదయాత్రకు తెలంగాణ ఇంటి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చెరుకు సుధాకర్ సంఘీభావం ప్రకటించి తన మద్దతు పాదయాత్రకు ఉంటుందని తెలిపారు. ఒబిసి సెల్ జాతీయ ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి, మాజీ శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ, ఓబీసీ సెల్ జాతీయ నాయకులు రాపోలు జయ ప్రకాష్ లు పాదయాత్రకు సంఘీభావం ప్రకటించి పీపుల్స్ మార్చ్ నిర్వహిస్తున్న విక్రమార్కుడి అడుగులో అడుగులు వేస్తూ కదం తొక్కారు. స్థానిక సిపిఎం, టిడిపి, నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పూలమాలవేసి సి ఎల్ పి నేతను సత్కరించారు.

భట్టి దంపతులకు సన్మాణం
మండలంలోని పెద్దమండవ గ్రామం లో కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మధిర శాసనసభ సభ్యులు, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఆయన సతీమణి నందినిలకు భారీ గజమాల వేసి ఘనంగా సన్మానించారు. అదేవిధంగా సారి పెట్టి సత్కరించారు.

పంటపొలాలను పరిశీలించిన విక్రమార్క
ముదిగొండ మండలం మల్లారం నుంచి పెద్దమండవ గ్రామానికి పాదయాత్రగా వస్తున్న సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మార్గమధ్యంలో రైతులు కలిశారు. నకిలీ విత్తనాలతో మొక్కజొన్న పంట దెబ్బతిందని మహిళా రైతు బేయబీ ఆవేదన వ్యక్తం చేసింది. మొక్కజొన్న చేను నిలబడి దారి వెంట వెళ్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తన చేను వద్దకు రావాలని కేకలు వేసి పిలిచింది. ఆమె కేకలు ఆలకించిన భట్టి విక్రమార్క వారి పంటపొలాల మధ్యన నడుచుకుంటూ ఆమె వద్దకు వెళ్లి ఆమె గోడును ఆలకించాడు. అధికార పార్టీ నాయకుల అండతో చేపలు పట్టడానికి పల్లీ చెరువుకు గండి పెట్టడంతో నీళ్లు లేక చెరువు కింద ఉన్న 100 ఎకరాలు వరిచేలు ఎండిపోతునదని రైతు ఎనగంటి ప్రవీణ్ ఆవేదన వ్యక్తం చేశారు. నెర్రేలు బారిన వరిచేలు చూసి సీఎల్పీ నేత చలించిపోయారు. మల్లారం నుంచి మండవల్లి దారి మధ్యలో ఉన్న కల్వర్టు పూర్తిగా కుంగిపోవడంతో ఎగువ నుంచి వరద నీరు వచ్చే సమయంలో కల్వర్టు దిగువన ఉన్న పంటపొలాలు పూర్తిగా మునిగి పోతున్నాయని రైతులు భట్టి విక్రమార్క దృష్టికి తీసుకువచ్చారు. రైల్వే బ్రిడ్జి నిర్మాణం కోసం నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రైతుల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తానని, హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణానికై ప్రభుత్వంతో నిధులు మంజూరు చేయిస్తానని రైతులకు హామీ ఇచ్చారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube