ప్రజా ఆశీర్వాద సభతో భట్టి ఓటమి ఖాయమైంది

ప్రజల ఓట్లతో గెలిచి అభివృద్ధిని మరిచిపోయిన భట్టి

0
TMedia (Telugu News) :

ప్రజా ఆశీర్వాద సభతో భట్టి ఓటమి ఖాయమైంది

– ప్రజల ఓట్లతో గెలిచి అభివృద్ధిని మరిచిపోయిన భట్టి

– లింగాల కమల్ రాజ్

 టీ మీడియా, నవంబర్ 22, మధిర : మధిర మండలం రాయపట్నం, దేశినేనిపాలెం గ్రామాల్లో కొండబాల కోటేశ్వరరావు గారితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమల్ రాజు కారు గుర్తుపై ఓటేసి శాసనసభ్యునిగా ఒక్క అవకాశం ఇవ్వాలని తద్వారా అండగా నిలబడి మధిర నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ పార్టీ మధిర అసెంబ్లీ అభ్యర్థి లింగాల కమల్ రాజు ఓటర్లను కోరారు. బుధవారం నాడు ఉదయం మధిర మండలం రాయపట్నం, దేశినేనిపాలెం గ్రామాల్లో రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ కొండబల కోటేశ్వరరావు తో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధిర ప్రజల ఓట్లతో గెలిచి ఇక్కడ అభివృద్ధిని, ప్రజల సమస్యలను మరిచిపోయిన భట్టి విక్రమార్క కి ప్రజలందరూ ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. నిన్న జరిగిన ప్రజా ఆశీర్వాద సభతో భట్టి విక్రమార్క ఓటమి ఖాయమైందన్నారు .కారు గుర్తుపై ఓటేసి గెలిపిస్తే చింతకాని మండలం తరహా మిగిలిన అన్ని మండలాల్లో ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు అందిస్తామని తెలిపారు. మధిర మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కోట్లాది రూపాయలతో పలు అభివృద్ధి పనులు పూర్తి చేసుకున్నాం అన్నారు.

Also Read : కాంగ్రెస్‌, బీజేపీలను గెలిపిస్తే రాష్ట్రం కుక్కల చింపిన విస్తరే

రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్లు ప్రతి ఇంటికి అందించిన కేసీఆర్ కి ఓటు వేసి మద్దతుగా నిలవాలన్నారు. తిరిగి మళ్లీ అధికారంలోకి రాగానే మహిళలకు సౌభాగ్య లక్ష్మి పథకం కింద రూ.3000/- వేల రూపాయల జీవన భృతి తో పాటుగా రూ.400/- రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలోని రాయపట్నం సర్పంచ్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube