మల్లు భట్టివిక్రమార్క పై సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారం మానుకోండి…

0
TMedia (Telugu News) :

టీ మీడియా, అక్టోబర్ 30,మధిర:

కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం లో మండల అధ్యక్షుడు సూరంసెట్టి కిషోర్ మాట్లాడుతూ.. సోషల్ మీడియా వేదికగా మధిర శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క పై తప్పుడు ప్రచారం చేయటం టిఆర్ఎస్ పార్టీ వారి అవివేకం సభా మర్యాద తెలియనటువంటి టిఆర్ఎస్ నాయకుల్లారా ప్రభుత్వ అధికార కార్యక్రమంలో రాజకీయాలు మాట్లాడుతూ మరల దానికి మల్లు భట్టి విక్రమార్క వివరణ ఇస్తుండగా సభలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ అడ్డు తగిలి మాట్లాడటం అది ఎంతవరకు సమంజసం అని శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్క ఒక గంట ఆలస్యంగా వచ్చినందున నాయకత్వ లక్షణాలు లేనటువంటి నీ వంటి వారు ఓర్పు సహనం కోల్పోవడం సిగ్గుచేటు.

అదేవిధంగా మీలానే ప్రజలు కూడా ఆలోచిస్తే ఏడు సంవత్సరాల క్రితం వాగ్దానం చేసిన డబుల్ బెడ్రూం ఇల్లు పేదలకు ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదు,దళితులకు 3 ఎకరాల భూమి,ఇంటికో ఉద్యోగం,నిరుద్యోగ భృతి,కొత్త వృద్ధాప్య వితంతు వికలాంగ పెన్షన్లు,రైతు రుణమాఫీ ఇవ్వనందున రైతులు ఎం అనాలని ,మీ టిఆర్ఎస్ నాయకుల కంటే ప్రజలే సహనంగా ఉన్నారు కావున ప్రజలు చూసైనా బుద్ధి తెచ్చుకోండి అని భట్టివిక్రమార్క పై తప్పుడు ప్రచారాలు మానుకోవలని అన్నారు.

ఈ సమావేశంలో మధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మిర్యాల వెంకటరమణ గుప్తా, మధిర మండల ఎస్సీసెల్ అధ్యక్షులు దారా బాలరాజు, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తూమాటి నవీన్ రెడ్డి, మధిర పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ జహంగీర్, మధిర పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు బిట్ర ఉద్దండయ్యా, మాజీ సర్పంచ్ కర్నాటి రామారావు, బొమ్మకంటి హరిబాబు, కాంగ్రెస్ నాయకులు ఆదిమూలం శ్రీనివాసరావు, మాగం ప్రసాద్, జింకల కోటేశ్వరరావు మొదలగు వారు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube