దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భవానీలు.

-గిరి ప్రదక్షిణతో భక్త జన సందోహం.

0
TMedia (Telugu News) :

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భవానీలు.

-గిరి ప్రదక్షిణతో భక్త జన సందోహం.

-రహదారుల కిట కిట

టి మీడియా, జనవరి 5,విజయవాడ : కనకదుర్గమ్మ నామస్మరణంతో ఇంద్రకీలాద్రి మార్మోగుతోంది.. వేల సంఖ్యలో తరలి వస్తున్న భవానీలతో ఆలయ పరిసరాలు అరుణ శోభితంతో వెల్లివిరుస్తున్నాయి. కనుచూపుమేరలో ఎటు చూసినా భవానీలే సాక్షాత్కరిస్తున్నారు. వేల సంఖ్యలో కిలోమీటర్ల కొద్దీ నడిచి కనక దుర్గమ్మ దర్శనం కోసం తరలివస్తున్నారు. భవానీల దీక్ష విరమణ మహోత్సవం రెండో రోజు అంచనాలకు మించి భవానీలు.. దుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. రెండు రోజుల్లో సుమారు రెండున్నర లక్షల మంది భవానీలు తరలిరాగా, 6 లక్షలకు పైగా లడ్డూ విక్రయాలు జరిగాయి. భవానీలకు ఇబ్బంది లేకుండా క్షేత్రస్థాయిలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, ఈవో కేఎస్ రామారావు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు..శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో భవానీ దీక్షా విరమణలు నిర్వహిస్తున్నారు..

Also Read : 7 నుంచి ఈసీ రాష్ట్రాల పర్యటన

భవానీ దీక్షా విరమణలు మొదటి రోజు బుధవారం ఉ.06 గం. ల నుండి రాత్రి 11.30 గం.ల వరకు సుమారు 70 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. 3.46 లక్షలపైగా లడ్డూ ప్రసాదం ను భక్తులు కొనుగోలు చేశారు. 17, 600 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. 16 వేల మంది పైగా భక్తులు అమ్మవారి అన్నప్రసాదం, స్వీకరించారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube