పిల్లలకు బాలోత్సవాలు అవసరం

0
TMedia (Telugu News) :

టీ మీడియా,డిసెంబర్,12, భద్రాచలం

మానవ మనుగడకు చెట్లు ఎంత అవసరమో పిల్లలకు బాలోత్సవాలు అంత అవసరమని గ్రీన్ భద్రాద్రి అధ్యక్షులు భోగాల శ్రీనివాసరెడ్డి అన్నారు. బెక్కంటి శ్రీనివాస్ ఛారిటబుల్ ట్రస్ట్ మరియు ఆట ఆధ్వర్యంలో నిర్వహించిన ఆన్‌లైన్ ఆట బాలోత్సవం బహుమతి ప్రదానోత్సవ వేడుకలు ఆదివారం నాడు భద్రాచలం వేంకటేశ్వర హోటల్ సమావేశ మందిరంలో బెక్కంటి శ్రీనివాసరావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.పిల్లల్లోని అంతర్గత శక్తులను వెలికితీయటానికి సహా పాఠ్యాంశాలపై పోటీలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని ప్రవాసాంధ్రులు యుఎస్ఏ నివాసి నిఖిత అభి జ్యోత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. గత పది సంవత్సరాల నుండి బెక్కంటి శ్రీనివాసరావు చేస్తున్న అనేక కార్యక్రమాలు ఎంతో మనోరంజకంగా,అందరికీ ఉపయోగపడేలా ఉన్నాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గజిటెడ్ ఉపాధ్యాయుల అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ మాధవరావు అన్నారు. బెక్కంటి ట్రస్ట్ చేసే కార్యక్రమాలు ఇటు సమాజాన్ని అటు పిల్లలకి ఉపయోగపడుతున్నాయని అందుకే ప్రతి కార్యక్రమానికి తాను హాజరవుతానని హెచ్డిఎఫ్సి మేనేజర్ వెంకట్రావు అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సహ పాఠ్యాంశాలు నిర్వహించటానికి ఆర్థిక పరిపుష్టి గానీ,సమయం గానీ ప్రభుత్వం కల్పించట్లేదని ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడైన బెక్కంటి శ్రీనివాసరావు చేసే కార్యక్రమాలు దేశ విదేశాల్లో ఆదరణ పొందడం మా సంఘ సభ్యుడిగా మాకు ఆనందంగా ఉందని జిల్లా పిఆర్టియు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి.వెంకటేశ్వరరావు జీ.రవి అన్నారు.

మంచి సమాజ స్థాపన కోసం రాష్ట్రపతి అవార్డు గ్రహీత బెక్కంటి శ్రీనివాసరావు ట్రస్ట్ చేస్తున్న కార్యక్రమాలకు తాను ఎంతో ఆకర్షితుడైననని భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు ఆట ద్వారా నిర్వహించాలని ఐటీసీ బీపీఎల్ చీఫ్ మేనేజర్ చంగల్ రావు కోరారు.అనంతరం ఆట బాలోత్సవ్ ఆన్లైన్లో విజేతలైన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పిల్లలకు అతిథుల చేతుల మీదుగా బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.చివరిగా కార్యక్రమానికి హాజరైన అతిథులందరికీ ఆట ఘనంగా సన్మానించి షీల్డ్ అందించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ భద్రాద్రి ప్రధాన కార్యదర్శి తిరుమల రావు,ఉత్తమ ఉపాధ్యాయుని, ట్రస్ట్ కోశాధికారి వేంపాటి ఉషారాణి,ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వై.కమలాకర్ రెడ్డి, ట్రస్ట్ ఆర్గనైజర్లు పోతుల రమేష్ బాబు,కె.వరప్రసాద్, జి.భూషణ్ రావు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube