భద్రాచలం రాములవారినే మోసం చేశావ్ కేసీఆర్: ఎంపీ కోమటిరెడ్డి హాట్ కామెంట్

0
TMedia (Telugu News) :

టీ మీడియా,నవంబర్, 20,భద్రాచలం

భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న భువనగిరి పార్లమెంట్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.కుటుంబ సమేతంగా ఆలయం వద్దకు వచ్చిన ఎంపీకి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు ఈవో,ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాముల ఎదుట ప్రత్యేక పూజలు నిర్వహించి లక్ష్మీ తయారు అమ్మవారి ఉపాలయం లో వేద ఆశీర్వచనం అందించి, స్వామివారి ప్రసాదాన్ని అందించిన ఈవో.అనంతరం కుటుంబ సమేతంగా నిత్య కళ్యాణ వేడుకలో పాల్గొన్న ఎంపీ కోమటిరెడ్డి అనంతరం విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.

భద్రాచల రాములవారి ఆలయ అభివృద్ధికి వందకోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానని చెప్పి ఎప్పటికి 8 యేండ్లు అయిన ఇవ్వలేదు.ఐదు పంచాయతీలు భద్రాచలంలో కలపాలని,బ్రిడ్జి నిర్మాణం చేపట్టి 7 ఏళ్ళు పూర్తవుతున్న ముఖ్యమంత్రి పట్టించుకోవడంలేదని అన్నారు.
నాటి ఆంద్ర పాలనలో జరిగిన అభివృద్ధి తప్ప కేసీఆర్ భద్రాచలం లో ఎలాంటి అభివృద్ధి చేయలేదు.దక్షిణ అయోధ్య గా పేరుగాంచిన పవిత్ర పుణ్య క్షేత్రంలో అభివృద్ధి శూన్యం కనీసం డంపింగ్ యార్డ్ కూడా లేకపోవటం కేసీఆర్ పనితీరుకు నిదర్శనం ఎంపీ కోమటిరెడ్డి విమర్శించారు.

It is not Appropriate to make personal criticisms in the legislature.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube