పార్కు ఏర్పాటుకు భూమి పూజ

పార్కు ఏర్పాటుకు భూమి పూజ

2
TMedia (Telugu News) :

పార్కు ఏర్పాటుకు భూమి పూజ

టీ మీడియా, డిసెంబర్ 2, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రంలోని కేడిఆర్ 32వ వార్డులో క్రీడ ప్రాంగణం పార్కులో పంచాయతీరాజ్ నిధుల నుంచి మన వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ద్వారా అడిగిన తక్షణమే పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఇచ్చిన మాట దాని ప్రకారం పార్కుకు 13 లక్షల 25000 నిధులు మంజూరు చేయడం జరిగింది. శుక్రవారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. వారికి మా వార్డు తరపున మా ఈ సందర్భంగా స్థానిక కౌన్సిలర్ పెండెం నాగన్న యాదవ్ ప్రజల తరఫున మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జిల్లా పార్టీ అధ్యక్షులు గట్టు యాదవ్, స్థానిక కౌన్సిలర్ పెండెం నాగన్న యాదవ్, మున్సిపల్ కౌన్సిలర్ సత్యం సాగర్, రహీం, మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహరెడ్డి, టిపిఎస్ సుధాకర్, సుమన్, మున్సిపల్ ఏఈ హేమలత, వార్డు అధ్యక్షులు మల్లికార్జున స్వామి, ధర్మారెడ్డి, ప్రభు లింగం, రామ్ రెడ్డి, కందిరమణ, నరసింహన్న, రవీందర్, రఘు నాయుడు, కంచ విజయలక్ష్మి, రమాదేవి, భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.

Also Read : అంగన్వాడీ కేంద్రంలో అక్షరాభ్యాసం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube