అదానీ గ్రూప్‌కు సుప్రీంకోర్టులో బిగ్ షాక్
-హిండెన్ బర్గ్ నివేదికపై విచారణకు గ్రీన్‌సిగ్నల్
టీ మీడియా, ఫిబ్రవరి 8,న్యూఢిల్లీ : అదానీ గ్రూప్ కి సుప్రీంకోర్టులో గట్టి షాక్ తగిలింది. అదానీ గ్రూప్ కి వ్యతిరేకంగా హిండెన్ బర్గ్ రీసెర్చ్ ఇచ్చిన నివేదికపై విచారణకు కోర్టు ఒప్పుకుంది. రిటైర్డ్ జడ్జితో కమిటీ వేసి విచారణ జరిపించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై అత్యున్నత న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. దీనిపై శుక్రవారం విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది.అదానీ గ్రూప్ పై త్వరితగతిన విచారణ చేపట్టాలని న్యాయవాది విశాల్ తివారీ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. హిండెన్ బర్గ్ నివేదిక దేశ ప్రతిష్టను దెబ్బతీసిందని, ఆర్థిక వ్యవస్థపైనా దీని ప్రభావం ఉంటుందని తివారీ తన పిల్ లో పేర్కొన్నారు. హిండెన్ బర్గ్ నివేదికపై మీడియా అత్యుత్సాహం మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేసినట్లు తాను దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు శర్మ.