నవీన్, వైశాలి కేసులో బిగ్ ట్విస్ట్
టీ మీడియా, డిసెంబర్ 10, హైదరాబాద్ : హైదరాబాద్ ఆదిభట్లలోని మన్నెగూడాలో జరిగిన యువతి కిడ్నాప్ వ్యవహారం ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పట్టపగలు దాదాపు వంద మందితో వచ్చి యువతిని కిడ్నాప్ చేసిన ఉదాంతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో ఈ కేసును పోలీసులు ఛాలెంజింగ్‌గా తీసుకున్నారు. యువతి కిడ్నాప్ అయిన గంటల వ్యవధిలోనే అమ్మాయిని అధికారులు కాపాడారు. కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డితో సహా ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. నల్గొండ నుంచి విజయవాడవైపు పారిపోతుండగా నవీన్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. నల్గొండజిల్లా మంచన్‌పల్లి వద్ద వైశాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వైశాలి, నవీన్ రెడ్డిలను ఒకే చోట విచారిస్తున్నారు. నవీన్-వైశాలి వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీరిద్దరికీ గతంలోనే వివాహం జరిగినట్లు తెలిస్తోంది. హిందూ సంప్రదాయం ప్రకారం వైశాలితో తనకు గతంలో వివాహం జరిగిందని నవీన్ వెల్లడించాడు.
Also Read : ఐఓఏ తొలి మహిళా అధ్యక్షురాలిగా పీటీ ఉష రికార్డు
2021 ఆగస్టు 4వ తేదీన బాపట్ల జిల్లా వలపర్ల టెంపుల్లో తమ వివాహం జరిగిందని వివరించాడు నవీన్. అయితే, బిడిఎస్ కంప్లీట్ అయ్యేదాకా పెళ్లి ఫొటోస్ బయటకు రావొద్దని వైశాలి కండీషన్ పెట్టిందన్నాడు. 2021 జనవరి నుంచి తామిద్దరూ ప్రేమలో ఉన్నట్టు తెలిపాడు నవీన్. వైశాలి కుటుంబ సభ్యులు తనతో డబ్బులు ఖర్చుపెట్టించారని ఆరోపించాడు. వైశాలి తల్లితండ్రులు కూడా బిడిఎస్ పూర్తవగానే పెళ్లి చేస్తామని మాట ఇచ్చారని, కానీ, ఇప్పుడు ఆ మాట తప్పారని ఆరోపించాడు. తన డబ్బుతో వైశాలి కుటుంబ సభ్యులు వైజాగ్, అరకు, వంజంగి, కూర్గ్, మంగుళూరు, గోకర్ణా, గోవాకు వెళ్లారని చెప్పాడు నిందితుడు. అంతేకాదు.. వైశాలి పేరు మీద ఒక వోల్వోకారు, వైశాలి తండ్రికి రెండు కాఫీ షాపులను రిజిస్ట్రేషన్ చేయించినట్టు కోర్టుకు తెలిపాడు నవీన్.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube