బీజేపీకి గుడ్‌బై చెప్పిన బీహార్ సీఎం

బీజేపీకి గుడ్‌బై చెప్పిన బీహార్ సీఎం

1
TMedia (Telugu News) :

బీజేపీకి గుడ్‌బై చెప్పిన బీహార్ సీఎం

టీ మీడియా, ఆగస్టు 9, పాట్నా: బీజేపీతో ఉన్న బంధానికి బ్రేక్ వేశారు నితీశ్ కుమార్‌. బీహార్‌లో ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వంలో సీఎంగా ఉన్న నితీశ్ కుమార్‌.. బీజేపీతో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. అయితే కొన్నాళ్ల నుంచి బీజేపీతో సంబంధాలు స‌రిగా లేని కార‌ణంగా.. ఆ కూట‌మికి ఇవాళ గుడ్‌బై చెప్పేశారు నితీశ్‌. బీజేపీ(77)-జేడీయూ(45) కూట‌మి పాల‌న బీహార్‌లో ముగిసిపోయింది. బీజేపీతో తెగ‌దెంపులు చేసుకున్న‌ట్లు జేడీ నేత నితీశ్ త‌మ ఎమ్మెల్యేల‌కు చెప్పారు.

Also Read : వీఆర్ఏల సమ్మెకు మాల మహానాడు మద్దతు

ఇక ఇవాళ సాయంత్రం 4 గంట‌ల‌కు సీఎం నితీశ్ కుమార్ ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌ను క‌ల‌వ‌నున్నారు. అయితే ఆర్జేడీ, కాంగ్రెస్‌తో క‌లిసి నితీశ్ కుమార్‌.. కొత్త ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే అవ‌కాశాలు ఉన్నాయి. నితీశ్ సీఎంగానే కొన‌సాగ‌నున్నారు.కొన్ని ఊహాగానాల ప్ర‌కారం ఆర్జేడీ నేత తేజ‌స్వి యాద‌వ్‌కు హోంశాఖ ఇవ్వ‌నున్నారు. నితీశ్‌కు ఆర్జేడీ, కాంగ్రెస్‌, లెఫ్ట్ పార్టీలు మ‌ద్ద‌తు తెలిపిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube