ఫ్లైఓవర్‌పైనుంచి

పడిన బైక్‌

0
TMedia (Telugu News) :

ఫ్లైఓవర్‌పైనుంచి పడిన బైక్‌.. యుకుడు మృతి
టీ మీడియా, మార్చి 2,హైదరాబాద్‌: నగరంలోని టోలిచౌకిలో ఫ్లైఓవర్‌పై నుంచి పడి ఓ యువకుడు మృతిచెందాడు. సాలార్‌జంగ్‌ కాలనీకి చెందిన మహమ్మద్‌ సర్పరాజ్‌ హుస్సేన్ ‌(18) అదే కాలనీలో ఉన్న ఓ మెడికల్‌ షాప్‌లో పని చేస్తున్నాడు. మంగళవారం రాత్రి బుల్లెట్‌పై టోలీచౌకి ఫ్లైఓవర్‌ మీదుగా షేక్‌పేట వెళ్తున్నాడు. అయితే అతివేగంగా వెళ్తూ అదుపుతప్పి ఫ్లైఓవర్‌ పైనుంచి కింద పడ్డాడు. హెల్మెట్‌ లేకపోవడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి.గుర్తించిన స్థానికులు అతడిని దవాఖానకు తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన గోల్కొండ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube