మహిళా మోర్చా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

మహిళా మోర్చా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

1
TMedia (Telugu News) :

మహిళా మోర్చా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

టీ మీడియా, సెప్టెంబర్ 15, వనపర్తి బ్యూరో : కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని బిజెపి మహిళా మోర్చా ఆధ్వర్యంలో అధ్యక్షరాలు వారణాసి కల్పన అధ్యక్షతన గురువారం బైక్ ర్యాలీని నిర్వహించారు. నిజాం రాజు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ సారథ్యంలో పోలీస్ చర్య జరిపి తెలంగాణను భారతదేశంలో సెప్టెంబర్ 17న విలీనం చేయడం జరిగింది.

Also Read : నూతన రాష్ట్ర సచివాలయానికి డా. బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు

విమోచన దినానికి సంబంధించి సంబరాలు జరుపుకోవాల్సిన అవసరం ఉందని అందులో భాగంగానే బిజెపి పలు కార్యక్రమాలు చేపడుతుందని ఈ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ ర్యాలీలో బిజెపి అధ్యక్షుడు ఎద్దుల రాజా వర్ధన్ రెడ్డి, బి కృష్ణ , ప్రభాకర్, మహిళా మోర్చా ఇన్చార్జి సబిరెడ్డి,రాష్ట్ర మహిళా మోర్చా కార్యదర్శి జ్యోతి రమణ , కౌన్సిలర్ పద్మ పరశురాం, ప్రధాన కార్యదర్శిలు రామన్ గౌడ్, మాధవరెడ్డి , కవిత అశ్విని రాధ, సుమిత్రమ్మ పద్మమ్మ ,మంగమ్మ ,ఈ దమ్మా,సూగురు లక్ష్మి, సరోజ కవిత ,అలివేలు ,బండి పుష్ప లక్ష్మీ నరసమ్మ, జ్యోతి, జ్యోత్స్న మరియు మండల మహిళా నాయకురాలు బిజెపి నాయకులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube