బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ( సీఐటీయూ ) ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ( సీఐటీయూ ) ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

1
TMedia (Telugu News) :

బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ( సీఐటీయూ ) ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ .

టి మీడియా,మార్చు 29 ,ఖమ్మం : మార్చి 28 , 29 దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మంగళవారం బిల్డింగ్ వర్కర్స్ జిల్లా కార్యాలయం ముందు సిఐటియు జిల్లా నాయకులు , కార్పొరేటర్ వెల్లంపల్లి వెంకట్రావు జెండా ఊపి బైక్ ర్యాలీనీ ప్రారంభించారు . ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముదాం శ్రీనివాసరావు , దోనోజు లక్ష్మయ్య ఆధ్వర్యంలో ఈ బైక్ ర్యాలీ కాల్వోడ్డు నుండి బయలుదేరి మయూరి సెంటర్ మీదుగా ధర్నా చౌక్ కు చేరుకుంది . తదనంతరం లేబర్ ఆఫీస్ ముందు జరిగిన కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ముదాం శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడుతూ 1996 కేంద్ర చట్టాన్ని , కేంద్రం రద్దు చేసింది . దాన్ని పునరుద్ధరించాలని , వలస కార్మికుల చట్టాన్ని పునరుద్ధరించాలని కార్మిక శాఖ లో పెండింగ్ లో ఉన్న క్లెయిమ్లన్ని వెంటనే పరిష్కారం చేయాలని కోరారు . అలాగే కార్మిక శాఖలో నమోదు చేసుకున్న భవన నిర్మాణ కార్మికులు అందరికీ మోటార్ సైకిల్లు ఇవ్వాలని , బోర్డు ద్వారా గృహనిర్మాణ రుణాలు , పిల్లలకు స్కాలర్షిప్లు , అడ్డాలకు స్థలాలు కేటాయించి మరుగుదొడ్లు , మంచినీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో తుశ్యాకుల లింగయ్య , ఎర్ర మల్లికార్జున్ , బోయినపల్లి వీరబాబు , టి.వి రమణ , లింగా క్రిష్ణ , దోనోజు పాపయ్య , అమరబోయిన లింగయ్య , గూడ రాంబ్రహ్మం గౌడ్ , బెల్లంకొండ లింగయ్య , పోతం సీతారాములు , పోతం విశ్వనాథం , పెనుగోండ వీరయ్య , పురాణం వెంకటేశ్వర్లు , జంగం నగేష్ , వెన్నబోయిన వెంకటేశ్వర్లు , రెడ్డి , శ్రీను , రాజయ్య , తదితరులు పాల్గొని ఏసిఎల్ వెంగమాంబ కి వినతి పత్రం అందజేశారు .

Also Read : సేంద్రీయ సాగుకు తీసుకున్న చ‌ర్య‌లేంటీ?

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube