ఉపాధి కూలీల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి

ఉపాధి కూలీల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి

1
TMedia (Telugu News) :

ఉపాధి కూలీల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి

20వ తేదీన జరిగే ప్రజా ప్రదర్శన విజయవంతం చేయండి

టీ మీడియా , జూన్ 18 , దుమ్ముగూడెం

దుమ్ముగూడెం మండలంలో గుర్రాల బయలు పౌల్లూరి పేట భీమవరం మారాయిగూడెం పి నారాయణ రావు పేట కొమ్మనాపల్లి గద్ద మడుగు గ్రామాలలో రెండు నెలల నుండి ఉపాధి కూలీలకు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కారం పుల్లయ్య మాట్లాడుతూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈనెల 20వ తేదీన సోమవారం నాడు దుమ్ముగూడెం మండలంలో పెద్ద ఎత్తున ప్రజా సమస్యల పరిష్కారం కోసం జరిగే ప్రజా ప్రదర్శన కు వేలాది మంది పాల్గొని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఆదివాసులు పోడు భూములు తరతరాలుగా సాగిస్తున్న వారికి అటవీ హక్కుల గుర్తింపు చట్టం ప్రకారం గా హక్కు పత్రాలు ఇస్తానని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 2021లో అక్టోబర్ లో జరిగిన సడక్ బంద్ కార్యక్రమం తర్వాత సెప్టెంబర్ 6వ తేదీ నుండి డిసెంబర్ఆర 6వ తేదీ వరకు అప్లికేషన్లు తీసుకొని సర్వే చేసి ఇస్తామని మాట తప్పిన ముఖ్యమంత్రి ని ఈ సందర్భంలో హెచ్చరిక చేశారు వెంటనే అటు హక్కుల గుర్తింపు చట్టం ప్రకారం గా పట్టాలు ఇవ్వాలని ప్రగళ్ళపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ కు నిధులు వెంటనే కేటాయించి సున్నం బట్టి నుండి కొత్తపల్లి వరకు సాగునీరు అందించాలని అర్హులైన పేదలందరికీ డబల్ బెడ్ రూమ్ లు ఇవ్వాలని సొంత ఇంటి స్థలం ఉన్నటువంటి వారికి కూడా డబుల్ బెడ్ రూమ్ లో మంజూరు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వర్గ సభ్యులు యలమంచి శ్రీనుబాబు, సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు సరియం ప్రసాద్, నాయకులు కోమరం వీర్రాజు , కల్లూరి వెంకటేశ్వర్లు, సోందే మల్లమ్మ, కల్లూరి లక్ష్మయ్య, కొమరం భూషయ్య, కుంజా లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube