సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా బిందాల్, అరవింద్ కుమార్ ప్రమాణ స్వీకారం
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా బిందాల్, అరవింద్ కుమార్ ప్రమాణ స్వీకారం
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా బిందాల్, అరవింద్ కుమార్ ప్రమాణ స్వీకారం
టీ మీడియా, ఫిబ్రవరి 13,న్యూఢిల్లీ : కొలీజియం సిఫార్సుల మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా ఉన్న మరో ఇద్దరికి పదోన్నతి లభించింది. అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ రాజేష్ బిందాల్, గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న అరవింద్ కుమార్‌లు సోమవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం ఉదయం సుప్రీంకోర్టు ప్రాంగణంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకారమహోత్సవంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్… బిందాల్, అరవింద్ కుమార్‌లచే ప్రమాణ స్వీకారం చేయించారు. వీరి నియామకంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 34కి చేరింది. జనవరి 31 సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుల మేరకు బిందాల్‌కు, అరవింద్ కుమార్‌లకు సుప్రీం న్యాయమూర్తులుగా నియమితులయ్యారు.