దోమల నివారణకు బయో నిటిక్స్ స్ప్రే
– ప్రారంభించిన మున్సిపల్ వైస్ చైర్మన్
టీ మీడియా, ఫిబ్రవరి 11, వనపర్తి బ్యూరో : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచన మేరకు వనపర్తి జిల్లా కలెక్టర్ తేజస్ చందులాల్ ఆదేశం మేరకు వనపర్తి మున్సిపల్ పరిధిలో దోమల నివారణకు చర్యలు చేపట్టడం జరిగింది. ఇటీవల వనపర్తి ప్రాంతంలో విపరీతంగా దోమల బెడద ప్రజలు బాధపడుతున్న సంగతిని నిరంజన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా బయోటిక్స్ స్ప్రే చేయవలసిందిగా ఆదేశించారు. అందులో భాగంగా దోమలు పెట్టిన గుడ్లు లార్వా నివారణకు చర్యలకు వనపర్తి మున్సిపల్ అధికారులు శ్రీకారం చుట్టారు. బయోటెక్స్ ద్వారా డ్రైనేజీలలో నిలువ ఉన్నటువంటి నీళ్లలో స్ప్రే చేయడం ద్వారా గుడ్ల నివారణతో పాటు దోమల నివారణ కు అవకాశం ఉంది. ఈ సందర్భంగా శనివారం ఒకటో వార్డు బ్రహ్మంగారి వీధి రాయగడ్డలో కౌన్సిలర్ కాగితాల లక్ష్మీనారాయణతో కలిసి వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీధర్ మాట్లాడుతూ పట్టణ ప్రజలందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఇండ్ల చుట్టూ మురుగునీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని
Also Read : 14న అమర వీర జవాన్ల దినోత్సవం నిర్వహించాలి
టెంకాయ బొండాలు నిల్వ పక్కల బయట వేయకుండా మున్సిపల్ చెత్త డాక్టర్లకు వేయాలని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని రోగాల బారిన పడకుండా ప్రతి ఒక్క పౌరుని బాధ్యతగా మున్సిపల్ అధికారులకు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఒకటవ వార్డ్ కౌన్సిలర్ కాగితాల లక్ష్మీనారాయణ, 21వ వార్డ్ కౌన్సిలర్ వెంకటేష్, మున్సిపల్ సిబ్బంది మన్నెం తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube