ఘనంగా ఆవిర్భావ దినోత్సవం

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 28 వనపర్తి : వనపర్తి జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం రోజున కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వనపర్తి జిల్లా మరియు పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర ముఖ్యఅతిథిగా వనపర్తి జిల్లా అధ్యక్షులు శంకర్ ప్రసాద్ పీసీసీ సభ్యులు శ్రీనివాస్గౌడ్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర కాంగ్రెస్ పార్టీ జెండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కలిసి జెండా ఎగరవేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు శంకర్ ప్రసాద్ మాట్లాడుతూ బ్రిటిష్ వారు మన దేశానికి విముక్తి కలిగించాలని బ్రిటిష్ వారిని తరిమి కొట్టిన కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం నవ భారత నిర్మాణంలో కీలకంగా ఏకైక పార్టీ అయిన భారతీయ జాతీయ పార్టీ ఎల్లప్పుడూ లౌకిక ప్రజాస్వామ్య న్యాయమైన మరియు సమగ్రమైన భారత దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ ముందడుగు వేస్తే నేటికీ 137 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో అక్తర్, అనీష్, కోట్లరవి, చీర్ల చందర్, రాధాకృష్ణ, బ్రహ్మం, కృష్ణవర్ధన్రెడ్డి, బాబా, వెంకటేష్, రాములు, మన్యంకొండ, వెంకటేశ్వర రెడ్డి, అబ్దుల్లా ,మధు గౌడ్, జాన్, నాగన్న, భాస్కర్ ,నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube