మానసిక దివ్యంగుల సమక్షంలో పుట్టినరోజు వేడుకలు
టీ మీడియా, జూలై07, మధిర:
స్విమ్మర్స్ క్లబ్ మధిర ఉపాధ్యక్షులు ఉప్పు సుబ్బారావు సతీమణి విజయదుర్గ 39వ పుట్టినరోజు వేడుకలను మధిర పట్టణంలోని వసంతమ్మ మానసిక దివ్యాంగుల సేవాసదనంలోని మానసిక వికలాంగులకు స్విమ్మర్స్ క్లబ్ కమిటీ గౌరవాధ్యక్షులు, సభ్యులు ఆధ్వర్యంలో పండ్లు,బియ్యం,స్వీట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవ సలహాదారులు వేమూరి సునీల్ కుమార్ మాట్లాడుతూ… జన్మదిన వేడుకలను మానసిక వికాంగుల ఆధ్వర్యంలో నిర్వహించుకోవాలన్న ఆలోచన చాలా గొప్పదని ఉప్పు సుబ్బారావు దంపతులను అభినందించారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మానసిక దివ్యాంగుల ఆధ్వర్యంలో వారి పెళ్లిరోజు పుట్టినరోజు తదితర కార్యక్రమాలు నిర్వహించుకోవాలని అదేవిధంగా తెలిసినవారికి వసంతమ్మ మానసిక వికలాంగుల సేవాసదనం గురించి తెలియజేయాలని తెలిపారు.
Also Read : బెంగాల్ హడలగొడుతున్న నైరోబీ ఈగ
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి
కొండూరు ఎలమందరావు, రంగిశెట్టి శ్రీనివాసరావు,ఎర్రం వెంకటకృష్ణ, వేముల నవీన్ కుమార్, కర్లపూడి వాసు,పావులూరి వెంకటేశ్వరరావు, చావా శీను,చెరుకూరి సురేష్, వడ్లమూడి సాయికుమార్, మేడ వెంకటేశ్వర రావు, చీకటి నాగేశ్వర రావు,చిట్యాల శేషు, మోచర్ల సురేష్ , స్విమ్మర్స్ సభ్యులు పాల్గొన్నారు.